ఆంధ్ర లో జగన్ చెయ్యని రాజకీయం లేదు. మాట్లాడితే కోర్టుకి వెళ్లడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ట్మాకంగా తీసుకున్నాయి. బిజెపి - జనసేన కూటమిగా ఏర్పాటై అభ్యర్థిని నిలబెడితే.. తెలుగు దేశం అభ్యర్థి కోసం చంద్రబబు రంగంలోకి దిగారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి కోసం జగన్ ప్రచారం ప్రాధాన్యతని సంతరించుకోగా.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం జనసేన పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చూసి భయపడినట్లుగా కనిపిస్తుంది అక్కడ రాజకీయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో ఉండే క్రేజ్ ఏ ఇతర హీరోకి లేదనేది వాస్తవం. సినిమా హీరోగా పవన్ అభిమానగణం గణనీయం.
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన వకీల్ సాబ్ మ్యానియా చూసి జగన్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టినట్లుగా ఉంది. అందుకే రాత్రికి రాత్రే బెనిఫిట్ షోస్ రద్దు చేసి జీవో మీద సంతకాలు కాదు.. మల్టిప్లెక్స్, ఏ ఇతర థియేటర్స్ రేట్లు పెంచకుండా జీవోలు జారీ చెయ్యడం మాములు విషయం కాదు. పవన్ ఇమేజ్, క్రేజ్ వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర చూసిన వైసీపీ నేతలకు మింగుడు పడడంలేదు. అందుకే రాత్రికి రాత్రి జీవోలు పాస్ చెయ్యడమే కాదు.. వకీల్ సాబ్ సినిమా చూడకుండానే వైసిపి నేతలు వకీల్ సాబ్ బాలేదంటగా అంటూ దీర్ఘాలు తియ్యడం, సోషల్ మీడియాలో వకీల్ సాబ్ కి నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడం అన్ని పవన్ ఫాన్స్ కి కోపం తెప్పిస్తున్నాయి.
మరోపక్క బిజెపి నేతలూ ఊరుకోవడం లేదు.. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి జగన్ భయపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ పవన్ కే కాదు.. పవన్ వకీల్ సాబ్ ని చూసి భయపడుతున్నారు అంటూ బీజేపీ నేత సునీల్ దేవధర్ ఎద్దేవా చేసారు. పవన్ వకీల్ సాబ్ కి నెగెటివ్ టాక్ ని వైసీపీ నేతలు వీలైనంతగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసారు. ఇక ఆంధ్ర, టీఎస్ లలో పవన్ వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ పడుంటే.. ఇండస్ట్రీ లోని అన్ని రికార్డ్స్ ని వకీల్ సాబ్ తుడిచి పెట్టేసేది అంటూ పవన్ ఫాన్స్ మొత్తుకుంటున్నారు. కావాలనే వకీల్ సాబ్ కి రాజకీయ రంగు పులిమారని వైసిపి నేతలను దుమ్మెత్తి పోస్తున్నారు పవన్ ఫాన్స్.