పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాలిటిక్స్ వైపుకి వెళ్లడంతో.. ఇటు సినిమాలు, అటు పాలిటిక్స్.. రెండు వైపులా దృష్టి పెట్టడం సాధ్యం కాదనే.. సినిమాలకు గుడ్ బై అని పవన్ అప్పట్లో చెప్పాడు. కానీ పాలిటిక్స్‌లో పవన్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోవడంతో.. ఇప్పుడు రెండు పడవల మీద ప్రయాణం అన్నట్లుగా.. ఇటు పాలిటిక్స్‌లో ఎంత బిజీగా ఉన్నాడో.. అటు సినిమాలతోనూ బిజీగా.. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి టైమ్ లేనంతగా కష్టపడుతున్నాడు. అయితే ఆయన సినిమాలకు గుడ్ బై అని ప్రకటించడంతో.. ఫ్యాన్స్ అందరూ నిరాశకు లోనయ్యారు. కానీ మొన్న ‘వకీల్ సాబ్’ ఫంక్షన్‌లో హరీష్ శంకర్ చెప్పినట్లుగా.. ఆయన సినిమాలను వదిలి పెట్టినా.. సినిమాలు మాత్రం ఆయనను వదలవు అన్నట్లుగా.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరసగా సినిమాలు ప్రకటించేశాడు.
ఇక ఆయన రీ ఎంట్రీలో చేసిన ‘వకీల్ సాబ్’ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాక మరో రెండు సినిమాలు తెరకెక్కాల్సి ఉన్నాయి. ఇక ‘వకీల్ సాబ్’ ప్రమోషన్స్‌లో దర్శకుడు వేణు శ్రీరామ్.. పవన్ కల్యాణ్‌కి వీరాభిమానిని అని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ అంటే ఎంత ఇష్టమో.. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కూడా ఆయన చెప్పాడు. అటువంటి వేణు శ్రీరామ్.. పవన్ రీ ఎంట్రీ చిత్ర బాధ్యతలు తీసుకోవడం మాములు విషయం కాదు. తీసుకున్నాక.. ఒక ఫ్యాన్ ఎలా అయితే తన హీరోని చూడాలనుకుంటాడో.. అలానే ఈ సినిమాని తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు. స్టేజ్‌పై ఉద్వేగంతో ఆయన చెప్పిన కొన్ని మాటలతో వేణు శ్రీరామ్.. పవన్ అభిమానులకు తెగ నచ్చేశాడు. పవన్ అభిమానులు త్రివిక్రమ్, హరీష్ శంకర్‌లను ఎలా అభిమానిస్తారో.. అలాంటి అభిమాన డైరెక్టర్‌గా మారిపోయాడు.
అలాంటి వేణు శ్రీరామ్‌కి రీసెంట్‌గా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒక వేళ పవన్ కల్యాణ్ కనుక ఈ సినిమా చేయకపోతే.. ఏ హీరోతో ‘వకీల్ సాబ్’ చిత్రం చేసేవారు.. అనే ప్రశ్న అతనికి ఎదురైంది. దీనికి వేణు శ్రీరామ్ సమాధానమిస్తూ.. ఒక వేళ కల్యాణ్ గారు ఈ సినిమా చేయనంటే మాత్రం.. ఈ సినిమా నాగార్జునగారితో చేసేవాడిని. ఎందుకంటే.. ప్రయోగాలు చేయడానికి నాగార్జున గారు ఎప్పుడూ ముందుంటారు. ఖచ్చితంగా ఆయనతో ‘వకీల్ సాబ్’ చేసేవాడిని.. అని చెప్పుకొచ్చాడు. వేణు చెప్పింది ఒకసారి ఊహలోకి వెళ్లి ఆలోచించండి.. వకీల్ సాబ్‌గా నాగార్జున.. ఎలా ఉన్నాడు? అల్రెడీ నాగార్జున.. ‘మురళీ కృష్ణుడు’, ‘అధిపతి’ సినిమాలలో లాయర్‌గా కనిపించిన విషయం తెలిసిందే.