Advertisementt

‘వకీల్ సాబ్’ ఫస్ట్ రిపోర్ట్: బ్లాక్ బస్టర్!

Mon 12th Apr 2021 02:15 PM
pawan kalyan,vakeel saab,first report,power star,vakeel saab report  ‘వకీల్ సాబ్’ ఫస్ట్ రిపోర్ట్: బ్లాక్ బస్టర్!
Vakeel Saab Movie First Report ‘వకీల్ సాబ్’ ఫస్ట్ రిపోర్ట్: బ్లాక్ బస్టర్!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం ఈ రోజు (ఏప్రిల్ 9) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఒకరోజు ముందే విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ రిపోర్ట్ బయటికి వచ్చేసింది. విడుదలైన అన్ని చోట్లా.. బ్లాక్‌బస్టర్ అనేలా టాక్ బయటికి వచ్చింది. ముఖ్యంగా వేణు శ్రీరామ్ ఈ సినిమాని మార్చిన తీరు, పాటల సందర్భం, పవన్ కల్యాణ్ నటన ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ అనేలా టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు భాషల్లో లేని విధంగా హీరోయిజాన్ని ఈ సినిమాలో హైలెట్ చేశారని తెలుస్తుంది. అలాగే పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వచ్చే సీన్లలో ఇద్దరూ పోటాపోటీగా చేశారని, చూస్తున్న వారికి సినిమా ఎక్కడా బోర్ కొట్టే ఛాన్సే లేదనేలా వార్తలు బయటికి వచ్చాయి. 

కాకపోతే ఫస్టాప్ కాస్త స్లోగా రన్ అవుతుందని, కానీ పవన్ కల్యాణ్ కనిపించిన ప్రతీసారి.. ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారని అంటున్నారు. అంతేకాదు ఆ రెండు సినిమాలలో లేని, ఓ కొత్త పాయింట్‌ని ఈ సినిమాలో చక్కగా చూపించారని, ప్రేక్షకులకు అది ఖచ్చితంగా నచ్చుతుందనేలా సాదారణ ప్రేక్షకులే చెబుతుండటం విశేషం. పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజన్స్‌తో అటు ఫ్యాన్స్‌కి, ఇటు ప్రేక్షకులకి దర్శకుడు సూపర్బ్ ట్రీట్ ఇచ్చాడనేలా టాక్ వచ్చేసింది. పూర్తి వివరాలు మరి కాసేపట్లో మన రివ్యూలో తెలుసుకుందాం.

Vakeel Saab Movie First Report:

First Report of Pawan Kalyan Movie Vakeel Saab

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ