త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో మూవీ ఆగిపోయినట్లుగా వార్తలు రావడం వెంటనే మహేష్ తో త్రివిక్రమ్ మూవీ ఫిక్స్ అయిపోయినట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ ఊపందుకోవడమే కాదు.. మహేష్ బాబు - త్రివిక్రమ్ మూవీ లో టాప్ హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లోను బిజీ అయిన పూజ హెగ్డే రీసెంట్ గా తమిళ్ స్టార్ హీరో విజయ్ మూవీలో నటిస్తుంది. తమిళ్ లో vijay65 లో నటిస్తున్న పూజ హేగ్డ్ కి నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే టాక్ ఉంది.
ఇక తాజాగా త్రివిక్రమ్ - మహేష్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైన పూజ హెగ్డే కి మేకర్స్ కళ్ళు తిరిగే రెమ్యునరేషన్ ఇస్తున్నారనే మాట కన్నా.. పూజ హెగ్డే డిమాండ్ చేసినంత ఇస్తున్నారంటే కరెక్ట్ ఏమో. త్రివిక్రమ్ తో రెండు సినిమాల్లో నటించిన పూజ హెగ్డే మహేష్ తో మహర్షి మూవీలో నటించింది. ఇప్పుడు త్రివిక్రమ్ తో మహేష్ మూవీ అంటేనే క్రేజ్, అందులోనూ పూజ హీరోయిన్ అంటే మరింత క్రేజ్.. కాబట్టే పూజ హెగ్డే కి 2.5 కోట్ల పారితోషకం ఇస్తున్నారట ఈ మూవీ కోసం.