రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా ఫిలిం జూన్ నుండి అయినా జులై నుండి అయినా సెట్స్ మీదకెళ్ళబోతున్నది అని.. ఆ మూవీ ని నిర్మించబోయే దిల్ రాజు చెబుతున్నాడు. వకీల్ సాబ్ ఇంటర్వ్యూ లో ఉన్న ఆయన చరణ్ - శంకర్ మూవీ గురించి మాట్లాడారు. ఇంకా హీరోయిన్ వేటలో ఉన్నామని, సినిమా సెట్స్ మీదకెళ్ళేసమయానికి.. అన్ని విషయాలను అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. ఇంతలోపే చరణ్ - శనకర్ మూవీ పై ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక శంకర్ - చరణ్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించబోతున్న విషయం ఎప్పుడో రివీల్ చేసాం. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ కూడా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ బాలీవుడ్ స్నేహితుడు సల్మాన్ ఖాన్ ఓ కీ రోల్ చేయబోతున్నాడని, అది కూడా ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర అంటూ ప్రచారం జరుగుతుంది. సల్మాన్ ఖాన్ రోల్ ని శంకర్ అదిరిపోయే మాదిరి డిజైన్ చేసాడని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా.. అనేది పక్కనబెడితే ఈ న్యూస్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదూ.