లాక్ డౌన్ ముగిసింది, థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. జనవరి నుండి పొలోమని సినిమాల విడుదలవుతున్నాయి. వారానికి నాలుగైదు సినిమాలు చొప్పున థియేటర్స్ మీద దండయాత్ర చేస్తున్నాయి. నెలకో సినిమా చొప్పున సూపర్ హిట్ అవుతుంది. ప్రేక్షకులు సినిమాలను ఆధరిస్తున్నారు. రేపు శుక్రవారం నుండి పెద్ద సినిమా వకీల్ సాబ్ జోరు మొదలు కాబోతున్న తరుణంలో తెలంగాణాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు స్కూల్స్, కాలేజెస్ మూసేసి థియేటర్స్ ఎలా ఓపెన్ చేస్తారు, కరోనా టెస్ట్ లు సరిగ్గా చెయ్యడం లేదంటూ హై కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో.. ఏప్రిల్ 15 నుండి థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
వకీల్ సాబ్ కి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ నడిచినా.. తర్వాత విడుదల కాబోయే సినిమాల పరిస్థితి ఏమిటి. లవ్ స్టోరీ ఏప్రిల్ 16 న, టక్ జగదీశ్ ఏప్రిల్ 23 న విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే లవ్ స్టోరీపై బోలెడంత క్రేజ్, హైప్ ఉన్నాయి. సారంగ దారియా సాంగ్ తోనే లవ్ స్టోరీ పై క్రేజ్ పెరిగిపోయింది. మరి 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ పెడితే సినిమాని విడుదల చేస్తారా? లేదంటే పోస్ట్ పోన్ చేస్తారో? అనే అనుమానంలో అక్కినేని ఫాన్స్ ఉన్నారు. మరోపక్క నాని టక్ జగదీశ్ పరిస్థితి అలానే ఉంది. ఇప్పటికే నాని వరస సినిమాల ప్లాప్స్ తో ఉన్నాడు. టక్ జగదీశ్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ అంటే నాని సినిమా రిలీజ్ కి ఒప్పుకుంటాడో? లేదో? చూడాలి. ఏది ఏమైనా ఈరోజో.. రేపో.. ఈ సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయో? లేదంటే అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ.