ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశం మొత్తం కరోనా విలయ తాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ కాదు.. కరోనా మూడో ప్రమాదం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. ఇక తెలంగాణలోనూ రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వెవ్ మొదలయ్యాక విద్యాసంస్థలను మూసివేసిన ప్రభుత్వం ఎట్టి పరిస్తితుల్లోనూ లాక్ డౌన్ పెట్టబోమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అయినా తెలంగాణాలో కరోనా కేసుల దృష్ట్యా లాక్ డౌన్ పెట్టొచ్చనే ఊహాగానాలు, కరోనా రోగులతో హాస్పిటల్ బెడ్స్ నిండిపోవడం, నైట్ కర్ఫ్యూ విధిస్తారని ప్రచారానికి తెలంగాణ ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేంద్ర మరోసారి క్లారిటీ ఇచ్చారు.
మహారాష్ట్రని అనుకుని ఉన్న జిల్లాలో అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, కరోనా రోగుల కోసం హాస్పిటల్ బెడ్స్ ఖాళీ చేయిస్తున్నామని, ఏప్రిల్ 15 నుండి థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ అమలు చేస్తామని చెప్పిన ఈటెల.. తెలంగాణాలో ఎట్టి పరిస్తితుల్లో లాక్ డౌన్ పెట్టమని, లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ పెట్టే పరిస్థితి తెలంగాణాలో లేదని, కరోనా కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా ఉందని.. కాబట్టి లాక్ డౌన్ కానీ కర్ఫ్యూ కానీ పెట్టే పరిస్థితి అయితే తెలంగాణాలో లేదని ఈటెల రాజేంద్ర స్పష్టం చేసారు.