Advertisementt

పుష్ప రాజ్ ఎంట్రీ: మాములుగా లేదు

Wed 07th Apr 2021 09:21 PM
allu arjun,pushpa pan india movie,pushpa movie,pushparaj,pushparaj intro,sukumar,rashmika mandanna,devi sri prasad,fasid fajil  పుష్ప రాజ్ ఎంట్రీ: మాములుగా లేదు
Pushparaj Intro Video పుష్ప రాజ్ ఎంట్రీ: మాములుగా లేదు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో  రెడీ అవుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం పబ్లిసిటీని ఓ రేంజ్ లో స్టార్ట్ చేసింది టీం. పాన్ ఇండియా ఫిలిం కాబట్టి ఆ రేంజ్ లోనే పుష్ప సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టిన పుష్ప టీం అల్లు అర్జున్ బర్త్ డే  కానుకగా పుష్ప రాజ్ వీడియో ని రిలీజ్ చేసింది. పుష్ప సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మాసివ్ లుక్ లో అదరగొట్టేసిన విషయం పుష్ప ఫస్ట్ లుక్ లోనే చూసేసాం. ఇప్పుడు పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ వీడియో చూస్తున్నాం. పుష్ప రాజ్ గా లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ ఎదురొచ్చిన పోలీస్ లని చితక్కొట్టేసే పుష్ప రాజ్ మాస్ లుక్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించేదిలా ఉంది. 

విజిల్ వేసి పోలీస్ జీపు వస్తున్న విషయాన్ని ఎర్రచందదనం నరికే కూలీలకు హింట్ ఇవ్వడం, అల్లు అర్జున్ ఎర్రచందనం నరికే కూలీగా కనిపించడం, ముసుగేసి అల్లు అర్జున్ చేతులకి కట్టేసినా అరివీర భయంకరంగా పరిగెత్తడం, నీటి మడుగులో సుడిగుండంలా దూసుకురావడం, లారీ డ్రైవర్ గా గమ్మత్తుగా కనిపించడం, విలన్స్ ని చితకబాదుతూ తగ్గేదేలే.. అంటూ పవర్ ఫుల్ అండ్ మాస్ పుష్పరాజ్ లుక్ నిజంగా ఫాన్స్ కి పండగే. ఎర్ర చందనం దుంగలతో  అల్లు అర్జున్ చేసిన ఫైట్, ముసుగుతోనూ విలన్స్ ని చితగ్గొట్టే సీన్స్ అన్ని సూపర్బ్ అనేలా ఉన్నాయి. మధ్యలో పనిలో పనిగా పుష్ప హీరోయిన్ రష్మికా విలేజ్ లుక్ ని కూడా పరిచయం చేసేసారు. 

ఇక టీజర్ మొత్తం మీద అల్లు అర్జున్ తగ్గేదే లే అనే ఒక్క డైలాగ్ మాత్రమే వినిపించింది. పుష్ప పాన్ ఇండియా ఫిలిం గా ఎన్ని భాషల్లో విడుదలవుతుంది అనేది పుష్ప టీజర్ లో చూపించారు. 

Pushparaj Intro Video :

Pushparaj Intro: Feast to Eyes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ