Advertisementt

బాలీవుడ్ లోనే తచ్ఛిట్లాడుతున్న బెల్లం బాబు

Wed 07th Apr 2021 06:58 PM
bellamkonda sai srinivas,mumbai,andheri,chatrapathi remake,alludu adurs,alludu adhurs disaster,tollywood to bollywood  బాలీవుడ్ లోనే తచ్ఛిట్లాడుతున్న బెల్లం బాబు
Bellamkonda Srinivas spotted at Bandra బాలీవుడ్ లోనే తచ్ఛిట్లాడుతున్న బెల్లం బాబు
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ కి టాలీవుడ్ లో అల్లుడు అదుర్స్ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. హడావిడిగా సంక్రాంతికి గట్టి పోటీ ఉన్న టైం లో అల్లుడు అదుర్స్ రిలీజ్ చేసి గట్టిగా దెబ్బతిన్నాడు. అయితే అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ ఛత్రపతి రీమేక్ కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసం ముంబై లోని కాస్ట్లీ ప్లేస్ లో ఓ ఇల్లు అద్దెకి కూడా తీసుకున్నాడనే టాక్ నడిచింది. ఇక బాలీవుడ్ హీరోల మాదిరి బెల్లంకొండ శ్రీనివాస్ కూడా జిమ్ లు వర్కౌట్స్ అంటూ ముంబై లోని అంధేరి ప్రాంతంలోనే తిరుగుతున్నాడు. గత నెల రోజులుగా బెల్లంకొండ శ్రీనివాస్ ముంబై లో ఉన్నాడో? హైదరాబాద్ లో ఉన్నాడో? తెలియదు కానీ తాజాగా ముంబై లో కనిపించి షాకిచ్చాడు.

మొన్నామధ్యన ఛత్రపతి రీమేక్ చెయ్యడానికన్నా ముందు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో మరో చిత్రం చేయబోతున్నాడని, అల్లుడు అదుర్స్ డిజాస్టర్ తర్వాత ఛత్రపతి రీమేక్ చేయడం ఎందుకు మళ్ళీ టాలీవుడ్ లోనే ఓ మూవీ చేసి సక్సెస్ కొట్టి అప్పుడు బాలీవుడ్ కి వెళదామని అనుకున్నాడనే టాక్ కూడా నడిచింది. మధ్యలో బెల్లంబాబు కి బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరూ సెట్ కావడం లేదు, టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తో నటించేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కి బాలీవుడ్ లోనూ ఏ సారా అలీ ఖానో , ఏ అలియా భట్టో దొరికేస్తుంది అనుకుంటే.. బెల్లకొండ చెక్కులకి బాలీవుడ్ భామలెవరూ పడడం లేదు. అయితే ఛత్రపతి రీమేక్ అప్ డేట్ లేకపోయేసరికి బెల్లంకొండ ముంబై ని వదిలేశాడేమో అనుకుంటే.. ప్రస్తుతం, బెల్లంకొండ ఇంకా ముంబైలోని అంధేరి ప్రాంతంలోనే తచ్ఛిట్లాడుతున్నాడు.

Bellamkonda Srinivas spotted at Bandra:

Bellamkonda Sai Srinivas spotted at Bandra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ