అమ్మాయిలు ఎప్పుడూ ఒంటరిగా రారు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్లా, ఆడపిల్లలు రౌడీలు విడదియ్యలేని ఒక ప్యాకేజీలా వస్తారు అంటూ జల్సా మూవీలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఆ సిట్యుయేషన్ కి ఎంత ఇంప్రెసివ్ గా అనిపించిందో... ఇపుడు రియల్ లైఫ్ లో ఆయన తీరు కూడా అంతే ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది.
తారక్ తో తాను చెయ్యాల్సిన మూవీని పోస్టుపోన్ చేసుకుని ఇమ్మీడియేట్ గా మహేష్ తో సినిమా మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్న గురూజీ... గతంలో తన పెన్ రాసిన డైలాగ్ లాగానే కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాకుండా సబ్జెక్టు - హీరోయిను రెండూ ఓ ప్యాకేజీలా పట్టుకు వెళుతున్నారట మహేష్ మూవీకి. ఇప్పటికే అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేసి తనకు బాగా ఫైన్ ట్యూన్ అయిపోయి ఉన్న పూజ హెగ్డేనే మళ్ళీ రిపీట్ చెయ్యనున్నారు త్రివిక్రమ్.
మరి పవన్, మహేష్ వంటి హీరోలకు గురూజీ పైన గురి ఎక్కువే కనుక ఇక ఆయన ప్రపోజల్ కాదనే ప్రసక్తే ఉండదు కదా. సో త్వరలోనే మనం మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమా న్యూస్ వింటాం. మహర్షి తరువాత మరోసారి మహేష్ - పూజ హెగ్డేల కలయికని చూస్తాం అన్నమాట.!