Advertisementt

బన్నీకి కూడా దొరికిందో భజన పాట.!

Wed 07th Apr 2021 02:43 PM
allu arjun birthday song,roll raida song for allu arjun,bunny birthday,  బన్నీకి కూడా దొరికిందో భజన పాట.!
birthday song for bunny బన్నీకి కూడా దొరికిందో భజన పాట.!
Advertisement
Ads by CJ

మాములుగా పవన్ కళ్యాణ్ బర్త్ డే కి సోషల్ మీడియాలో హడావిడి ఎక్కువ ఉంటుంది. మేము అభిమానులం కాదు ఆయన భక్తులం అంటూ రెచ్చిపోయే పవర్ స్టార్ ఫాన్స్ మాటలు, ట్వీటులతోనే కాకుండా ప్రత్యేకమైన పాటలతోనూ సందడి చేస్తూ ఉంటారు. వారితో కోన వెంకట్, బాబా సెహగల్ వంటి పలువురు సెలబ్రిటీలు కూడా జత కలుస్తూ ఉంటారు. ఇపుడు అదే తరహా స్పందన అల్లు అర్జున్ కి కూడా వస్తోందా అన్నట్టుంది చూస్తోంటే.!

ఇప్పటికే తనకు వచ్చిన స్టార్ డమ్ ని ఎన్ని రకాలుగా ప్రాజెక్ట్ చేసుకోవాలో అన్ని రకాల ప్రయత్నాలూ చేసుకుంటోన్న బన్నీ కి తాజాగా రోల్ రైడా రూపంలో అనుకోని ఆసరా దొరికింది. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆల్ రెడీ పుష్ప టీం స్పెషల్ వీడియో ప్లాన్ చెయ్యగా.. అంతకుముందే హ్యాపీ బర్త్ డే టు బన్నీ అంటూ తన మార్క్ రాప్ సాంగ్ తో దిగిపోయాడు రోల్ రైడా. బిగ్ బాస్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోల్ రైడా.. రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ అప్పీరియన్స్ కి పాడిన బ్యాక్ గ్రౌండ్ రాప్ బాగా పాపులర్ అయింది. మరిప్పుడు అల్లు అర్జున్ కోసం చేసిన ఈ స్పెషల్ సాంగ్ కి ఏ రేంజ్ రీచ్ ఉంటుందో చూడాలి. మొత్తానికి ఏదైతేనేం బన్నీ బాబుకి కూడా ఒక భజన పాట వచ్చేసిందన్న మాట.!

birthday song for bunny:

bunny song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ