అన్న చిరు తో రత్తాలు రత్తాలు అంటూ డాన్స్ చేసి.. తమ్ముడితో తోబ తోబా అంటూ ఐటెం సాంగ్స్ లో కాలుకదిపి అదరగొట్టిన లక్ష్మి రాయ్ సినిమాల్లో సరైన సక్సెస్ కోసం చాలానే కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ డ్రెస్సులతో, బికినీ షో చేస్తూ కవ్వించిన లక్ష్మి రాయ్ కి అవకాశాలు రావడం లేదు. బీచ్ వెంట బికినీ లతో హీటెక్కిస్తున్నా లక్ష్మి రాయ్ ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అయితే గతంలో క్రికెటర్ తో ప్రేమలో పడింది లక్ష్మి రాయ్ అన్నప్పటికీ.. లక్ష్మి రాయ్ మాత్రం అది నిజం కాదని చెప్పేది.
కానీ తాజాగా లక్ష్మి రాయ్ పెళ్లి ముచ్చట సోషల్ మీడియా ద్వారా తెలియలేదు.. డైరెక్ట్ గా లక్ష్మి రాయ్ తన పెళ్లి మేటర్ ఓపెన్ చేసింది. పెళ్లి విషయం కన్నాముందు తనకి నిశ్చితార్ధం కూడా పూర్తియినట్లుగా చెప్పి షాకిచ్చింది. తాను ఎప్పటినుండో రిలేషన్ లో ఉన్నానని.. ఏప్రిల్ 27 నిశ్చితార్ధం జరగనున్నట్లుగా చెబుతుంది.. తన ప్రియుడితో లైఫ్ ని షేర్ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉందని, ఏప్రిల్ 27 న తనకి జరగబోయే నిశ్చితార్ధం డేట్ ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. తాను ఇదంతా ప్లానింగ్ ప్రకారం చెయ్యలేదని.. అన్నీ అనుకోకుండా ఇలా జరిగిపోయాయని.. తనకి పెళ్లి నిశ్చయమైందుకు ఫ్యామిలీ మెంబెర్స్ అంతా హ్యాపీ అంటూ చెప్పుకొచ్చింది.