Advertisementt

బాలీవుడ్ లో రకుల్ దూకుడు

Tue 06th Apr 2021 08:51 PM
rakul preet singh,romance,ayushmann khurrana,doctor g movie,doctor g script  బాలీవుడ్ లో రకుల్ దూకుడు
Ayushmann Khurrana - Rakul Preet Singh started reading Doctor G Script బాలీవుడ్ లో రకుల్ దూకుడు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది. కేవలం మెగా హీరో వరుణ్ తేజ్ తో క్రిష్ డైరెక్షన్ లో నటించిన సినిమా కూడా విడుదలైపోతే రకుల్ ని టాలీవుడ్ పిలుస్తుందా.. పక్కనబెడుతుందా.. అనేది తేలిపోతుంది. అలాగే కోలీవుడ్ లోనూ రకుల్ ప్రీత్ కి ఆఫర్స్ నిల్. కానీ రకుల్ కి బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. డ్రగ్స్ కేసులో ఇబ్బందులు పడినా.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో దూకుడు చూపిస్తుంది. సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఫొటోస్ తో అదరగొట్టేసే రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ ఆఫర్స్ ఊపిరాడనివ్వడం లేదు. ఇప్పటికే ఐదారు సినిమాలు చేతిలో ఉన్న రకుల్ కి తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకె అయ్యింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా డాక్టర్ జి లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమా ఓకె అయ్యింది.

అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో డాక్టర్ జి షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా రకుల్ అండ్ ఆయుష్మాన్ ఖురానా లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకి షేర్ చేసారు. ఈ సినిమాలో గైనికాలజిస్ట్ చదివే పిజి స్టూడెంట్ గా ఆయుష్మాన్ ఉదయ్ గుప్తా పాత్రలో కనిపించబోతుంటే.. రకుల్ ఆయుష్మాన్ కి జూనియర్ డాక్టర్ గా ఫాతిమా పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ మేడే, అటాక్, థ్యాంక్ గాడ్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా వుంది. అలాగే వర్కౌట్స్ అంటూ ముంబై లోనే రకుల్ జిమ్ కి వెళుతూ తరుచు ఫోటో గ్రాఫర్స్ కి చిక్కుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా రకుల్ సైజు జీరో గ్లామర్ తో అదరగొట్టేస్తుంది.

Ayushmann Khurrana - Rakul Preet Singh started reading Doctor G Script:

Rakul Preet Singh to romance Ayushmann Khurrana in Doctor G

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ