కరోనా జీవితంలో ఒక భాగం అనే మాట వాస్తవమయ్యేలానే కనిపిస్తుంది ప్రస్తుతం పరిస్థితి. కరోనా క్రైసిస్ వలన గత ఏడాది తొమ్మిదినెలల జీవితాన్ని కోల్పోయాము. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుంది. అంతేకాదు కరోనా లాక్ డౌన్ పెట్టినప్పుడు ఎక్కువమంది సెలబ్రిటీస్ కరోనా నుండి తప్పించుకున్నారు. ఆగష్టు నుండి షూటింగ్స్ మొదలైనా.. పెద్దగా కరోనా ఎఫెక్ట్ కనిపించలేదు కానీ సెకండ్ వేవ్ లో పలువురు సెలబ్రిటీస్ అందునా బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా కరోనా బారిన పడడం కలవరం సృష్టిస్తుంది. అక్షయ్ కుమార్ దగ్గరనుండి కార్తీక్ ఆర్యన్, రణబీర్ కపూర్, అలియా భట్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. రోజుకో సెలెబ్రిటీ కరోనా పాజిటివ్ న్యూస్ తో హైలెట్ అవుతున్నారు.
తాజాగా బాలీవుడ్ హాట్ క్యూటీ కత్రికా కైఫ్ కి కరోనా పాజిటివ్ రావడం ఆమె అభిమానులని కలవర పెడుతుంది. కొద్దిసేపటి క్రితమే తనకి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా కత్రినా ట్వీట్ చేసింది. దానితో బాలీవుడ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అందుకే మహారాష్ట్ర సర్కార్ వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లు అమలు చేస్తుంది. పార్క్ లు, హోటల్స్, పర్యాటక ప్రదేశాలు మూసివేశారు. అయినప్పటికీ ఇలా కేసులు పెరిగిపోవడం మాత్రం అందరిని అందోళనకు గురి చేస్తుంది. కత్రినా కైఫ్ కి కరోనా పాజిటివ్ రాగానే ఆమె హోమ్ ఐసోలేషన్ కి వెళ్ళిపోయినట్టుగా తెలిపింది. పెద్దగా సింటెమ్స్ లేవని, అయినా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కత్రినా ట్వీట్ చేసింది.