Advertisementt

ఆడపిల్లకి జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్

Tue 06th Apr 2021 01:57 PM
bigg boss season 1,bigg boss contestent,hari teja,baby girl  ఆడపిల్లకి జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్
Hari Teja Blessed With Girl ఆడపిల్లకి జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగులో ఫస్ట్ టైం బుల్లితెర మీద మొదలైన బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ గా వచ్చిన హరితేజ అప్పటికే బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు పరిచయమే. కాకపోతే బిగ్ బాస్ తో హరితేజ మరింతగా ఫెమస్ అయ్యింది. మనసు మమతా సీరియల్ తో బుల్లితెర కి ఎంట్రీ ఇచ్చిన హరితేజ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమాతో సూర్యకాంతంగా పాపులర్ అయ్యింది. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించిన హరితేజాకి ఆ సినిమా తర్వాత మరింతగా అవకాశాలొచ్చాయి. 

ఇక బిగ్ బాస్ క్రేజ్ తో యాంకర్ గాను అదరగొట్టిన హరితేజ 2015 లో వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఇక గత ఏడాది ప్రెగ్నెంట్ అయిన హరితేజ సీమంతం వేడుకలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. బిగ్ బాస్ ఉత్సవం అంటూ స్టార్ మా లో ప్రారం అయిన ప్రోగ్రాం లోనూ హరితేజాకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేతుల మీదుగా సీమంతం జరిగింది. అంతేకాదు.. హరితేజ బేబీ బంప్ ఫోటో షూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా హరితేజ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చినట్లుగా ప్రకటించింది. హరితేజాకి ఆడపిల్ల పుట్టినట్లుగా ఈ శుభవార్తని అభిమానులతో షేర్ చేసుకుంది. 

Hari Teja Blessed With Girl:

Hari Teja blessed with a baby girl 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ