ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా క్లైమాక్స్ షూట్ లోను, అలాగే జెమిని ఛానల్ లో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో షూటింగ్ తోనూ బిజీగా వుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత చెయ్యబోయే త్రివిక్రమ్ మూవీ కూడా ఇదే నెల చివరి వారంలో అయినా, మే ఫస్ట్ వీక్ నుండి అయినా మొదలు కావొచ్చని NTR30 నిర్మాత చెప్పారు. మరోపక్క త్రివిక్రమ్ కూడా పవన్ ఏకే రీమేక్ హడావిడిలో ఉన్నారు. అయితే గత రెండు రోజులుగా NTR30 గురించిన న్యూస్ లు సోషల్ మీడియాని కమ్మేశాయి. NTR30 సినిమా ఆగిపోవచ్చని, ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఉండకపోచ్చనే న్యూస్ లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ 30 నిర్మాత అవన్నీ జస్ట్ జోక్స్ అంటూ NTR30 ఆగలేదని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసినా కొంతమంది యాంటీ ఫాన్స్ మాత్రం NTR30 పై విషం చిమ్ముతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో #WeakupNTR30team అంటూ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. NTR30 పై అప్ డేట్ కావాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా లేదు. NTR30 అప్ డేట్ ఇవ్వమని WeakUpNTR30Team అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ ఫాన్స్ లో అనుమానము, భయము మొదలైనట్టే కనబడుతుంది. ఒకపక్క రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా ఆచార్య షూటింగ్ ఫినిష్ చేసేసాడు. ఇక శంకర్ తో పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్న టైం లో NTR30 పై వచ్చే వార్తలకు ఎన్టీఆర్ ఫాన్స్ కి కంటిమీద కునుకు లేకుండిన చేస్తుంది.
మరి త్రివిక్రం కానీ, ఎన్టీఆర్ కానీ, లేదంటే NTR30 నిర్మాతలు కానీ NTR30 పై స్పందిస్తే ఈ రూమర్స్ కి చెక్ పడుతుంది.. లేదంటే ఇలాంటి వార్తలు మరిన్ని సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం గ్యారెంటీ.