Advertisementt

రష్మిక బర్త్ డే స్పెషల్

Mon 05th Apr 2021 06:54 PM
rashmika mandanna,rashmika birthday special,pushpa pan india film,adavallu meeku joharlu movie look,rashmika first look in adavallu meeku joharlu,sharwanand - rashmika,rashmika bday,rashmika birthday celebrations  రష్మిక బర్త్ డే స్పెషల్
Rashmika Mandanna Birthday Special రష్మిక బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాక మోగిపోతున్న పేరు. చలాకి హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలను చుట్టేస్తున్న రష్మిక రీసెంట్ గా నటించిన సుల్తాన్ ఈమధ్యనే విడుదలైంది. ఇక తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ, శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీస్ చేస్తున్న రష్మిక బాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తుంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న రశ్మికకి విషెస్ చెబుతూ పుష్ప టీం తరుపున నుండి ఓ స్పెషల్ పోస్టర్ తో విషెస్ తెలియజేసారు మేకర్స్. 

ఇక శర్వానంద్ - కిషోర్ తిరుమల కాంబోలో రష్మిక నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం నుండి రష్మిక బర్త్ డే స్పెషల్ గా రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేసింది టీం. ఆ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్లో .. పసుపు రంగు చీర కట్టుకుని చిరునవ్వు నవ్వుతూ గార్డెన్ లో కూర్చొని దేవుడి కోసం బంతిపూలదండ  క‌డుతున్న ర‌ష్మిక మంద‌న్న లుక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభంకానుంది. అలాగే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి రశ్మికకి స్పెషల్ బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రష్మిక కి సినీ జోష్ టీమ్ తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Rashmika Mandanna Birthday Special:

Rashmika Mandanna latest movies updates 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ