అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ లో బాగా బిజీగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆగష్టు 13 టార్గెట్ రీచ్ అవ్వాలంటే కష్టపడాలి. అందుకే అల్లు అర్జున్ - సుకుమార్లు రెస్ట్ లేకుండా పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ వారం నుండే పుష్ప ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రిల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్ వీడియో కి విశేష స్పందన వచ్చింది. ఏప్రిల్ 7 న పుష్ప రాజ్ ని రివీల్ చెయ్యబోతున్నారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి మాల్దీవులకు చెక్కేసాడు. కొడుకు అయాన్ బర్త్ డే వేడులకు మాల్దీవుల్లోనే చేసిన అల్లు అర్జున్ అక్కడ భార్య స్నేహ, కూతురు అర్హ, కొడుకు అయాన్ ఇంకా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
తాజాగా భార్య స్నేహ తో కలిసి రొమాంటిక్ గా దిగిన సెల్ఫీ ని షేర్ చేసాడు అల్లు అర్జున్. స్నేహ రెడ్డి కూడా హీరోయిన్స్ మాదిరి గ్లామర్ గా రెడీ అయ్యి.. భర్త అర్జున్ తో తెగ ఎంజాయ్ చెయ్యడమే కాదు.. సాగర తీరానా.. సంధ్య సమయాన అంటూ స్నేహ ఇచ్చిన గ్లామర్ ఫోజ్ అమ్మో హీరోయిన్స్ కూడా అంతలా కనిపించరేమో ఆనేలా ఉంది. బన్నీ, స్నేహ హ్యాట్స్ పెట్టుకుని దిగిన సెల్ఫీ, అలాగే ఫ్యామిలీ తో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.