బాలీవుడ్ పింక్ సినిమా చూస్తే అమితాబచ్చన్ హీరోయిజం అంతగా కనిపించదు. మొత్తం సినిమా హీరోయిన్స్ చుట్టూనే తిరుగుతుంది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ కి వచ్చేసరికి సినిమా చాలావరకు పవన్ హీరోయిజం చుట్టూనే తిరుగుతుంది అనేది మనం చెప్పడం కాదు దర్శకుడు వేణు శ్రీరామ్ చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం పింక్ స్క్రిప్ట్ లో మార్పులు చెయ్యడమే కాదు.. ఏకంగా టైటిల్ నే పవన్ ఇమేజ్ కోసం మార్చేశామని చెప్పారు. మరి అలాంటప్పుడు అమితాబచ్చన్ పింక్ సినిమాలో కనిపించే టైం కన్నా వకీల్ సాబ్ లో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువుండాలి. అందుకే పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించిన టాపిక్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో రేజ్ అయ్యింది.
వకీల్ సాబ్ సినిమా మొదలయ్యాక పవన్ కొద్దిసేపటికే ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీన్ ద్వారా ఎంట్రీ ఇస్తాడని, ఆ సీన్ లో మూడేళ్ళ తర్వాత పవన్ ని అలా చూసిన ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాని చెబుతుంటే.. పవన్ స్క్రీన్ మీద కనిపించే ప్రతిసారీ ఫాన్స్ ని కుర్చీల్లో నిలవనియ్యదని, ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వకీల్ సాబ్ లో 45 మినిట్స్ దాక ఉంటుంది అని తెలుస్తుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ తో 45 డేస్ వర్క్ చేశాననే చెప్పాడు. కేవలం 45 డేస్ కి పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల పారితోషకం దిల్ రాజు ఇచ్చినట్లుగా ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్తే. పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు పవన్ ఫాన్స్ క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు.