పవన్ కళ్యాణ్ చాలా మొహమాటస్తుడు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తి. అసలు ఆయనకు ఎవ్వరూ గుర్తుపట్టని చోటు అంటే ఓ పర్ణశాలలో ఒంటరిగా ఆధ్యాత్మికంలో గడిపే జీవితం అంటే చాలా ఇష్టమట. కానీ ఇలా సినిమాల్లో హీరో అయ్యి అందరి గుండెల్లో గుడి కట్టుకుంటానని పవన్ ఎప్పుడు ఎక్సపెక్ట్ చేయలేదట. అయితే పవన్ స్నేహితుడు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్.. మీరు ఆ పర్ణశాల, ఒంటరి జీవితాన్ని ఈజన్మలో మరిచిపోండి.. మీరు సినిమాలు చెయ్యాలి అంటూ సలహా కూడా ఇచ్చాడట. ఈ మాటలు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఈవెంట్ లో చెప్పినవి.
ఇక పవన్ కళ్యాణ్ కి దేశభక్తి అంటే చాలా ఇష్టమట. అలాగే తానొక కానిస్టేబుల్ కొడుకుని, వేణు శ్రీరామ్ గారు అన్నట్టు ఓ టైలర్ కొడుకుతో సినిమా చెయ్యడం అనేది అదృష్టం. చిన్న ఫ్యామిలీ నుండి వచ్చి స్వతంత్రంగా ఎదిగే వారిని వెన్నుతట్టడం అనేది మా అదృష్టం. ఇక సినిమాల్లో ఐటెం సాంగ్స్ చెయ్యడం పెద్దగా నచ్చదు. ఆ సాంగ్ ప్లేస్ లో దేశభక్తి పాట ఉంటే బావుండును అనుకునేవాడిని. అది చూసి అందరూ నన్నొక పిచ్చోడిలా చూసేవారు. అయితే బండ్ల గణేష్ - హరీష్ శంకర్ ఇద్దరూ నన్ను గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక సాంగ్ ని చెయ్యడానికి ఒప్పించారు. గబ్బర్ సింగ్ లో ఆ కెవ్వు కేక చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాను. కళ్ళజోడు పెట్టుకుని ఎక్సప్రెషన్స్ కనబడకుండా చేసుకుంటూ వెళ్లిపోయాను.
ఐటెం సాంగ్స్ ని తప్పుబట్టను.. కానీ నాకు దేశభక్తి పాటలంటే చాలా ఇష్టం అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు.