హైదరాబాద్ లోని సంధ్య థియేటర్.. 1998 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా రిలీజ్ అయిన రోజు.. ఓ చిన్న (కేవలం సెకండ్ ఫిలిం) డిస్ట్రిబ్యూటర్, ఓ అభిమాని పవన్ కళ్యాణ్ తో సినిమా తియ్యాలనే కలని సాకారం చేసుకున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరో కాదు, ఆ డైరెక్టర్ మరెవరో కాదు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు. ఆ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హారిష్ శంకర్. తోలిప్రేమ సినిమా రిలీజ్ అయిన టైం లోనే నేను గనక నిర్మాత అయితే పవన్ గారితో సినిమా చెయ్యాలని దిల్ రాజు అప్పట్లోనే అంటే 1998 లోనే అనుకున్నాడట. ఇక పవన్ ఫ్యాన్ హరీష్ శంకర్ కూడా నేను డైరెక్టర్ అయితే ఈయన తో సినిమా చెయ్యాలని అనుకున్నారట. దిల్ రాజు కోరిక ఇప్పటికీ వకీల్ సాబ్ తో తీరగా హరీష్ శంకర్ పవన్ తో రెండో సినిమాకి సిద్దమవుతున్నాడు.
అయితే ఇప్పుడు దిల్ రాజు - హరీష్ శంకర్ చెప్పిన అదే సంధ్య థియేటర్ లో మరో బిగ్ ట్విస్ట్ ఏమిటి అంటే.. సంధ్య థియేటర్ లో తొలిప్రేమ ని వరసగా నాలుగు షోస్ చూసిన ఓ వ్యక్తి మాత్రం సినిమా చూసి పవన్ ని డైరెక్ట్ చెయ్యాలని అనుకోలేదట. ఆయనే వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్. దిల్ రాజు గారు, హరీష్ గారు చెప్పిన అదే సంధ్య థియేటర్ లో తొలిప్రేమని వరసగా నాలుగు షోస్ చూసిన నేను ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు.. కానీ ఓ మాములు టైలర్ కొడుకుతో పవన్ సర్ సినిమా చెయ్యడం అంటే.. అది నా పిల్లల అదృష్టం. ఓ మాములు సాధారణ వ్యక్తి అయిన నాలో పవన్ గారికి ఏం నచ్చిందో ఆయన నాతో సినిమా చేసారు.. అంటూ వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ ఈవెంట్ లో మాట్లాడారు