కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాలను ఆతలాకుతల చేస్తుంది. ఒక్కో రాష్ట్రంలో వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతుంటే.. వందల్లో కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టినట్టుగా ఈ సెకండ్ వేవ్ టైం లో లాక్ డౌన్ పెట్టే ఉద్దేశ్యం లేదని చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. నైట్ కర్ఫ్యూ, విద్యా సంస్థల మూసి వేత లాంటివి తప్ప లాక్ డౌన్ పెట్టె ప్రసక్తే లేదంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నాగపూర్, హిమాచల్ ప్రదేశం, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లో కరోనా ఉధృతి పెరుగుతున్న కారణంగా నైట్ కర్ఫ్యూలు హోటళ్లు, థియేటర్స్, విద్యాసంస్థల మూసివేత లాంటివి చేస్తుంటే మహారాష్ట్ర సర్కార్ మాత్రం కరోనా పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ పెట్టడానికి వెనుకాడమని ప్రకటించింది.
మహారాష్ట్ర సీఎం అన్నట్టుగానే మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కారణముగా వీకెండ్ లాక్ డౌన్ ఉంటుంది అని ప్రకటించారు. వీకెండ్ లాక్ డౌన్ కఠినంగా అమలు పరుస్తామని, శని, అది వారాల్లో లాక్ డౌన్ పెడుతున్నట్టుగా, రాత్రి ఎనిమి గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా ప్రకటించింది. బీచ్, గార్డెన్స్ మూసివేత. ఆఫీస్ ఎంప్లాయిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక హోటల్స్ నుండి కేవలం పార్సిల్స్ తప్ప రెస్టారెంట్ కి వెళ్లి తినడానికి అనుమతులు లేవని, లాక్ డౌన్ కఠినంగా అమలు పరుస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది.