కొరటాల శివ - మెగాస్టార్ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావొస్తుంది. కేవలం రిలీజ్ కి 40 రోజుల టైం మాత్రమే మిగిలి ఉన్న ఆచార్య కి అప్పుడే పబ్లిసిటీ స్టెంట్ స్టార్ట్ చేసేసారు. లాహే లాహే సాంగ్ రిలీజ్ చేసింది టీం. ఆ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అయితే నిన్నటివరకు ఆచార్య నిడివి విషయంలో చిరు టెంక్షన్ పడగా.. కొరటాల నేను ఎడిటింగ్ సంగతి చూసుకుంటాను మీకెందుకు కూల్ గా ఉండండి అని హామీ ఇవ్వడంతో చిరు కూల్ అయినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆచార్య కి మరో పెద్ద సమస్య వచ్చి పడిందట.
అది సీజీ వర్క్. కొరటాల తన సినిమాల్లో ఎక్కువగా సిజి వర్క్ కి ప్రాధాన్యత ఇవ్వకపోయినా.. ఆచార్య సినిమాలో టెంపుల్ సెట్, మరి కొన్ని సెట్స్ వేసినా.. అవి పురాతన ఆలయాలకు సంబంధించినవిగా చూపించడానికి సీజీ వర్క్ పై ఆధారపడవలసి వస్తుందట. అయితే ఇప్పుడు ఆచార్య సీజీ వర్క్ పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయట. షూటింగ్ చివరి దశలో ఉన్నా ఈ సీజీ వర్క్ విషయంలో టీం ఇప్పుడు టెంక్షన్ పడుతుందట. అటు కొరటాలకి సీజీ వర్క్ కొత్త.. అటు సీజీ కంపెనీస్ కూడా అనుకున్న టైం కి పని పూర్తి అవ్వనివ్వవు కాబట్టి.. ఆచార్య సీజీ వర్క్ విషయంలో ప్రాబ్లెమ్ ఫేస్ చెయ్యడం ఖాయం అంటున్నారు.