Advertisementt

జాతి రత్నాలు: అవెందుకు కత్తిరించారయ్యా

Sat 03rd Apr 2021 06:26 PM
jathi ratnalu movie,naveen polishetty,priyadarshi,rahul ramakrishna,jathi ratnalu,,delated scenes,you tube  జాతి రత్నాలు: అవెందుకు కత్తిరించారయ్యా
Jathi Ratnalu delated scenes in You tube జాతి రత్నాలు: అవెందుకు కత్తిరించారయ్యా
Advertisement
Ads by CJ

నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకుడిగా రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి కీలకపాత్రల్లో నటించిన జాతి రత్నాలు బాక్సాఫీసు బాక్సులు బద్దలు కొట్టేసింది. నవీన్ పోలిశెట్టి కామెడీ, రాహుల్ - ప్రియదర్శి కామెడీ సినిమాని హిట్ చేసేశాయి. అనుదీప్ మేకింగ్ స్టయిల్, ఫన్, హీరోయిన్ ఫారియా అబ్దుల్లా స్పెషల్ అట్రాక్షన్ అన్నీ సినిమాకి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. జాతి రత్నాలు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాలో నిడివి కారణంగా ఎడిటింగ్ లో చాలా సీన్స్ లేపెయ్యల్సి వచ్చింది. సినిమా విడుదలైన 20 రోజుల తరవాత ఆ డిలేటెడ్  సీన్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది స్వప్న సినిమాస్ నిర్మాణ్ సంస్థ.

ఆ సీన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో వదులుతూ ఆ సీన్లు ఎందుకు డిలేట్ చేశారయ్యా అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ సీన్స్ లో నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ఆద్యంతం  నవ్వులు పూయించారు. ఆ డిలేటెడ్ సీన్స్ కూడా సినిమాలో ఉంటే బావుండు అనిపించేలా ఉన్నాయి. మరి సినిమా నిడివి దృష్టిలో పెట్టుకునే ఇలాంటివి పక్కనబెట్టారు కానీ.. లేదంటే అవి కూడా మంచి హిట్ అయ్యేలా ఉన్నాయి.

Jathi Ratnalu delated scenes in You tube:

Jathi Ratnalu delated scenes in Youtube

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ