Advertisementt

ఫాన్స్ ని ఉత్కంఠకి గురి చేస్తున్న డైరెక్టర్

Fri 02nd Apr 2021 10:53 PM
high court,film director,shankar,mega fans,ram charan,dil raju,charan - shankar combo  ఫాన్స్ ని ఉత్కంఠకి గురి చేస్తున్న డైరెక్టర్
Big relief for Shankar in High Court ఫాన్స్ ని ఉత్కంఠకి గురి చేస్తున్న డైరెక్టర్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోయే పాన్ ఇండియా ఫిలిం సమస్యల్లో పడింది.. శంకర్ తాను చెయ్యాల్సిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఫినిష్ చేసేవరకు రామ్ చరణ్ తో సినిమా చెయ్యడానికి వీలు లేదని కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు కోర్టులో కేసు వేశారు. ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇండియన్ 2 మూవీ ఫినిష్ చేశాకే శంకర్ మరో ప్రాజెక్ట్ చెయ్యాలని వారు కోర్టుకెక్కారు. ముందు ఈ సినిమాకి 150 కోట్లు అనుకున్నామని.. కానీ అది కాస్తా 235 కోట్లకి చేరింది అని, మధ్యలో యాక్సిడెంట్ అవడంతో సినిమా ఆగిపోయింది అని.. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయిన సినిమాని వదిలి ఆయన వేరే ప్రాజెక్ట్ ఎలా వెళతారు అంటూ లైకా వారు కోర్టులో వాదిస్తున్నారు. 

ఇండియన్ 2 కి శంకర్ కి 40 కోట్ల పారితోషకం కి కాను 14 కోట్లు ఇచ్చేశామని, మిగతా 26 కోట్లని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని లైకా వారు వాదిస్తున్నారు. వాళ్ళు శంకర్ ముందుగా మా సినిమా కంప్లీట్ చేశాకే వేరే ప్రాజెక్ట్ చేసుకోవాలని కోర్టుని కోరుతున్నారు. మరోపక్క శంకర్ న్యాయవాది తమకి లైకా వారితో ఉన్న ఇబ్బందులను కోర్టు ముందు వివరించగా.. లైకా వారు అడిగినట్లుగా స్టే విధించలేమని, అసలు శంకర్ ఇండియన్ 2 మూవీ చెయ్యకుండా మరో మూవీ ఎందుకు ఒప్పుకున్నారో వివరణ ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. శంకర్ న్యాయవాది వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.

అయితే కోర్టు తీర్పుపై మెగా ఫాన్స్ ఉత్కంఠ తో ఉన్నారు. చరణ్ ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ ఫినిష్ కాగానే జూన్ నుండి శంకర్ పాన్ ఇండియా మూవీకి షిఫ్ట్ అవుతారని ఆశపడుతుంటే.. ఇప్పుడు ఈ అడ్డంకి ఏమిటో అని.

Big relief for Shankar in High Court:

High Court relief for film director Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ