కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఫెమస్ అయ్యాడు. అప్పటినుండి ప్రశాంత్ నీల్ తో సినిమాలు చెయ్యడానికి సౌత్ హీరోలందరిలో ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. దాదాపుగా ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ ఫిక్స్ అయ్యింది అనే న్యూస్ నడిచినా మధ్యలోకి ప్రభాస్ దూరాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ స్టార్ట్ అవడం కూడా జరిగింది. ఓ పక్క కెజిఎఫ్ 2 మరోపక్క సలార్ షూటింగ్ అంటూ ప్రశాంత్ నీల్ రెండు సినిమాలను బాలెన్స్ చేస్తున్నాడు. ఈమధ్యలో అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్ మూవీ.. అది కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ కోసం చర్చలు జరుగుతున్నట్టుగా ప్రచారం జరిగింది.
ఇప్పుడు టాలీవుడ్ హీరోలైపోయారు. ఇక ప్రశాంత్ నీల్ కన్ను కోలీవుడ్ మీద పడింది అని.. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరోల కోసం చూస్తున్నాడని, అలానే ప్రభాస్, మహెష్, అల్లు అర్జున్.. ఇప్పుడు ఆయన లిస్ట్ లో తమిళ టాప్ హీరో విజయ్ వచ్చాడట. విజయ్ తో ప్రశాంత్ నీల్ ఓ పాన్ ఇండియా మూవీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం విజయ్65 తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ లైన్ లోకి రావొచ్చనే ఊహాగానాలు కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో నిజమెంతుందో ప్రశాంత్ నెల్ స్పందిస్తేనే కానీ తెలియదు.