రానాకీ జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ

Nidhi Agarwal To Romance Rana

ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత అందులో నటించిన హీరోయిన్స్ ఇద్దరూ తెగ బిజీ అవుతారు.. ఎందుకంటే అంత గ్లామర్ గా అందాలు ఆరబోశారు.. అందుకే నిధి అగర్వాల్, నభ నటేష్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరి వెలిగిపోతుంది అని అనుకున్నారు. అయితే ఓ అన్నంత ఆఫర్స్ రాకపోయినా ఈ ఇద్దరు ఇస్మార్ట్ బ్యూటీస్ మంచి మంచి సినిమాలతో అవకాశాలు దక్కించుకుంటున్నారు. నభ మీడియం బడ్జెట్ మూవీస్ తో బిజీ అయితే.. నిధి అగర్వాల్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటించేస్తుంది. క్రిష్ - పవన్ కాంబో మూవీలో నిధి అగర్వాల్ అందాల మోత మాములుగా ఉండదట. ఆ విషయాన్నీ నిధినే చెబుతుంది.

ఇక లేటెస్ట్ గా రానా చెయ్యబోయే ప్రొజెక్ట్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రానా నటించిన విరాట పర్వం మూవీ రిలీజ్ కి సిద్ధమవుతుంటే.. పవన్ కళ్యాణ్ తో కలిసి రానా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఏకే రీమేక్ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత రానా చెయ్యబోయే ఓ బిగ్ ప్రొజెక్ట్ కోసం హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. మరి పవన్ సినిమా, రానా సినిమా ఇలా నిధి కెరీర్ గాడిన పడినట్లే కనిపిస్తుంది. 

Nidhi Agarwal To Romance Rana Next Movie

nidhi agarwal
rana
pawan kalyan
hari hara veeramallu movie
krish movie
nidhi agarwal glamour show