వరస ప్లాప్స్ లో ఉన్న హీరో రామ్ ని పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆదుకున్నాడు. ఆ సినిమాతో రామ్ మాస్ హీరోగా ప్రొజెక్ట్ అయ్యాడు. అంతకుముందు లవర్ బాయ్ గా హిట్స్ కొట్టిన రామ్.. ఇస్మార్ట్ తర్వాత మాస్ ఫాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. తర్వాత ఏ సినిమా చేస్తాడో అనుకుంటే.. రెడ్ అనే తమిళ మూవీకి రీమేక్ చేసాడు. ఆ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనితించిన రామ్ కి రెడ్ అనుకున్న సక్సెస్ ఇవ్వలేదు. మళ్ళీ డైలమాలో పడిన రామ్ ఈసారి ఏకంగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో బైలింగువల్ మూవీకి ఓకె చెప్పేవాడు. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ చెయ్యాల్సిన స్క్రిప్ట్ తో రామ్ లింగుస్వామితో సినిమా చేస్తున్నాడనే టాక్ ఉంది.
అయితే ఇప్పుడు రామ్ - లింగుస్వామి కాంబో సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలో రామ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇంతవరకూ రామ్ ఇలాంటి పాత్ర చేయక పోవడంతో ఇప్పుడు రామ్ చెయ్యబోయే ఆ పోలీస్ పాత్రపై ఆయన అభిమానుల్లో క్యూరియాసిటీ మొదలైంది. మరి బన్నీ స్క్రిప్ట్ అంటే బన్నీ ఎనర్జీ , బన్నీ డాన్స్ స్టయిల్, బన్నీ మాస్ స్టయిల్ అన్ని రామ్ లో చూస్తారు కాబట్టి రామ్ ఈ స్క్రిప్ట్ ని ఎంతవరకు మ్యాచ్ చేస్తాడో చూడాలి.