బిగ్ బాస్ అంటేనే గ్లామర్, కాంట్రవర్సీ. ఈ రెండు ఉంటేనే ప్రేక్షకుల్లో బిగ్ బాస్ పై ఆసక్తి ఉండేది. బుల్లితెర ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిన బిగ్ బాస్ కి విలేజెస్ లో మంచి ఫాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ 4 సీజన్స్ ని వారు విపరీతంగా ఆదరించారు కాబట్టే ఐదో సీజన్ కోసం స్టార్ మా అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇక గ్రామాల్లో బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 4 లో ఏ ఎపిసోడ్ గురించి అడిగిన టక్ న సమాధానాలు చెప్పేస్తున్నారు. సోహెల్ విన్ అయితే బావుండేది.. అభిజిత్ మొదట్లో బావున్నా. తర్వాత బిహేవియర్, టాస్క్ పెరఫార్మెన్స్ బాలేదు, మోనాల్ ఏడుపు నచ్చలేదు అంటూ తమ తమ ఫీలింగ్స్ ని బయటపెట్టారు.
అదెలా ఉన్నా ఇప్పుడు బిగ్ బాస్ 5 వ సీజన్ కోసం ఈసారి కాంట్రవర్సీ కేండేట్స్ ని అలాగే గ్లామర్ గర్ల్స్ ని ఎక్కువగా తీసుకోబోతున్నారట. అంటే హారిక, మోనాల్, అరియనా గ్లామర్ కూడా బిగ్ బాస్ కి సరిపోలేదట. ఈసారి మరింత గ్లామర్ ఉండేలా బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తుందట. అలాగే సెలబ్రిటీస్ విషయంలోనూ బిగ్ బాస్ యాజమాన్యం పక్కా ప్లానింగ్ లో ఉందట. పేరున్న సెలబ్రిటీస్ కి పారితోషకాలతో కొట్టబోతుందట. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 గ్లామర్ గా కలర్ ఫుల్ గా ఉండడం ఖాయమట. మరి జులై నుండి సీజన్ 5 మొదలు కావొచ్చని, దానికి సంబందించిన లిస్ట్ ని స్టార్ మా ప్రిపేర్ చేస్తుందట.