వైసిపి పార్టీ ఎమ్యెల్యే, జబర్దస్త్ జేడ్జ్ రోజా ఈ మధ్యన రెండు మేజర్ ఆపరేషన్స్ చేయించుకున్న విషయం తెలిసిందే, ఆమె భర్త సెల్వమణి రోజా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మీడియాకి సమాచారం అందిస్తూనే ఉన్నారు. అయితే అటు పొలిటికల్ గాను, ఇటు సినిమా ఇండస్ట్రీకి రోజా బాగా కావాల్సిన మనిషి గనక ఆమెని అందరూ పరామర్శిస్తున్నారు. అటు వైసిపి నాయకులూ, మంత్రులు రోజాని పరామర్శించిన వారిలో ఉండగా.. ఇప్పుడు తెలుగు దేశం ఎమ్యెల్యే, రోజా సహనటుడు అయిన బాలకృష్ణ రోజాను ఫోన్ లో పరార్శించడం హాట్ టాపిక్ అయ్యింది.
రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉండే రోజా - బాలకృష్ణ లు కలిసి అనేక హిట్ సినిమాల్లో నటించారు. అదే స్నేహం అసెంబ్లీకి వెళ్లినా మెయింటింగ్ చేస్తున్నారు ఇద్దరూ. గతంలోనే అసెంబ్లీ ఆవరణలో రోజా ని బాలయ్య పలకరించడం ఎంతగా వైరల్ అయ్యిందో.. ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్న రోజాను బాలకృష్ణ ఫోన్ లో పలకరించడం అంతే వైరల్ అయ్యింది. ఆమె ఆరోగ్యంపై ఆరా తీసిన బాలయ్య .. రోజా త్వరగా కోలుకోవాలాని ఆకాంక్షించారు. బాలయ్య ఫోన్ కాల్ పై రోజా, ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ హ్యాపీగా ఫీలైనట్లుగా తెలుస్తుంది.