చిరులో డాన్స్ గ్రేస్ తగ్గలేదని ఆయన కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ నిరూపించారు. చిరు అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే చిరు. ఇప్పుడు చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు. అందులోనూ బాసు లోని గ్రేస్ మరోసారి చూపించాడు. లాహే లాహే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చెయ్యడంతో పాటుగా అందులో సంగీత డాన్స్ వీడియో క్లిప్స్, చిరు డాన్స్ వీడియో క్లిప్స్ తో పాటుగా కాజల్ అగర్వాల్ డాన్స్ ని కూడా చూపించేసారు. మధ్యలో ఆచార్యలో సిద్ద పాత్ర చేస్తున్న రామ్ చరణ్ షూటింగ్ స్పాట్ ఎంట్రీ, ఫోటో కార్డ్స్ అబ్బో లాహే లాహే వీడియో మాములుగా లేదు,.
మణిశర్మ సంగీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ఆచార్య స్టెప్స్ తో ఈ సాంగ్ ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తుంది. సంగీత చీర కట్టులో అద్భుతమైన స్టెప్స్ వేస్తె.. కాజల్ గ్లామర్ గా లంగా ఓణిలో స్టెప్స్ తో ఆకట్టుకుంది. ఇక మధ్యలో బాస్ చిరు స్టెప్స్ సాంగ్ కే హైలెట్ అనేలా ఉన్నాయి. ఈ సాంగ్ మొత్తం ఆచార్య కోసం స్పెషల్ గా వేసిన టెంపుల్ సెట్ లో షూట్ చేసారు. ఒకే ఒక్క సాంగ్ తో ఆచార్య సినిమాపై మంచి అంచనాలు పెంచడమే కాదు.. ఎప్పుడెప్పుడు ఆచర్య ని చూసేద్దామా అని ఆత్రుత పెరిగిపోతుంది ఫాన్స్ లో.