ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటుగా మలయాళం సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్ రీమేక్ ని పట్టాలెక్కించిన మెగాస్టార్ చిరంజీవి.. లూసిఫర్ కోసం లుక్ చేంజ్ చేయబోతున్నాడట. ఆచార్య కి లూసిఫర్ కి లుక్ లో పెద్దగా వేరియేషన్స్ లేకపోయినా లూసిఫర్ రీమేక్ కోసం చిరు మీసకట్టుని కాస్త స్టయిలిష్ గా చూపించబోతున్నారట దర్శకుడు మోహన్ రాజా. ఆచార్య లో చిరు లుక్స్ మీద వస్తున్న ట్రోల్స్.. లూసిఫెర్ రీమేక్ లో రాకూడదని.. దర్శకుడు చిరు లుక్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ కోసం చేసిన మార్పులు అవి చిరుకి నచ్చడంతోనే ఈ సినిమాని వెంటనే పట్టాలెక్కించేశారట చిరు.
అయితే ఇప్పుడు మలయాళ రీమేక్ లూసిఫర్ రీమేక్ కి టైటిల్ గా రారాజు అనే టైటిల్ అయితే బావుంటుంది అని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చిరు లుక్ కి సినిమా కథకి రారాజు అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది అని.. అదే టైటిల్ చిరు లూసిఫర్ రీమేక్ కి పెట్టొచ్చనే ప్రచారం మొదలైంది. ఇక చిరు అటు ఆచార్య ఇటు లూసిఫర్ రీమేక్ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న లూసిఫర్ రీమేక్ మీద మంచి అంచనాలే ఉన్నాయి.