Advertisementt

నాగ్ తపన.. ఏమవుతుందో

Tue 30th Mar 2021 06:51 PM
nagarjuna,wild dog movie,nag mind blowing promotions,wild dog craze promotions  నాగ్ తపన.. ఏమవుతుందో
Wild Dog Mind Blowing Promotions నాగ్ తపన.. ఏమవుతుందో
Advertisement
Ads by CJ

మూడేళ్ళ నుండి వరస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడుతున్న నాగార్జునకి.. మన్మధుడు 2, ఆఫీసర్ సినిమాలు కోలుకోలేని దెబ్బకొట్టాయి. అలాగే ఆయనకిష్టమైన ప్రాజెక్ట్ బంగార్రాజు ని పట్టాలెక్కించేందుకు కూడా నాగార్జున తెగ ఆలోచిస్తున్నాడు. ఇక లాక్ డౌన్ ముందు వైల్డ్ డాగ్ అంటూ ఇవెస్టిగేషన్ స్క్రిప్ట్ తో మూవీ మొదలు పెట్టి.. లాక్ డౌన్ ముగియగానే కంప్లీట్ చేసేసిన నాగార్జున ఆ సినిమాని రేపు శుక్రవారం థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నాడు. ఎన్నడూ లేని విధంగా నాగార్జున వైల్డ్ డాగ్ ని ప్రమోట్ చేస్తున్నాడు. టీం తో కలిసి హుషారుగా వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ కి హాజరవుతున్నారు. 

యూట్యూబ్ ఛానల్ దగ్గర నుండి ఛానల్స్ లో వచ్చే స్పెషల్ ప్రోగ్రామ్స్ అయిన.. స్టార్ట్ మ్యూజిక్ ఇలా ప్రతి ఛానల్ లోనూ నాగ్ తన టీం తో హడావిడి చేస్తున్నాడు. అంటే నాగార్జున కి ఈ సినిమా హిట్ కంపల్సరీ. అందుకే ఎంతగా ప్రమోట్ చెయ్యాలో అంతగా ప్రమోట్ చేస్తున్నాడు నాగ్. లేదూ ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది అంటే గనక నాగ్ కి చాలా కష్టం. ఎందుకంటే సీనియర్ హీరోలైన చిరు, వెంకీ, బాలయ్యలు భారీ బడ్జెట్ మూవీస్ తో ఇప్పటికి బిజీగానే ఉంటున్నారు. కానీ నాగ్ మాత్రం బాగా వెనకబడిపోయాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ రిలీజ్ అయితే.. నాగ్ ఫ్రీ అవుతాడు. ఇక తర్వాత ప్రవీణ్ సత్తారు తో మొదలు పెట్టిన మూవీలో జాయిన్ అవుతాడు. ఆ మూవీలో నాగ్ సరసన హీరోయిన్ గా గ్లామర్ భామ కాజల్ ఎంపికైన విషయం తెలిసిందే.

Wild Dog Mind Blowing Promotions:

Nagarjuna Wild Dog Mind Blowing Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ