Advertisementt

చరణ్-శంకర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Tue 30th Mar 2021 05:15 PM
ram charan,dil raju,shankar,ram charan - shankar,pan india film  చరణ్-శంకర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting news on Charan-Shankar movie చరణ్-శంకర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్. ఆర్. ఆర్ మూవీ తో పాటుగా తండ్రితో కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాలు పూర్తి కాగానే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. శంకర్ ప్రస్తుతం చరణ్ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ఈ సినిమాలో రామ్ చరణ్ సీఎం గా కనిపించబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RC15 సినిమా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతుంది అని.. శంకర్ ఈ సినిమాని ఒకే ఒక్కడు మూవీ తరహాలో తెరక్కించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. 

గతంలో అర్జున్ హీరోగా ఒకే ఒక్కడు మూవీలో.. ఓ జర్నలిస్ట్ ఒక్క రోజు సీఎం గా ఉంటే.. రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదాన్ని సినిమాగా చూపించిన శంకర్ ఈసారి రామ్ చరణ్ ని అలాంటి పాత్రలో చూపించబోతున్నారట.

ఓ ఐఏఎస్ అధికారి సీఎం గా మారాల్సి వస్తే.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ఐఏఎస్ అధికారి సీఎం అయ్యాక ప్రజలకు చేసిన మంచి ఏమిటి అనేది.. శంకర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లా తెరకెక్కించబోతున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ సినిమాలో రామ్ చరణ్ కి హీరోయిన్ గా కియారా అద్వానీతో సంప్రదింపులు జరుగుతున్నాయనే టాక్ ఉంది. 

అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య కనిపించబోతున్నారు. ఇక రామ్ చరణ్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు శంకర్ పూర్తి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకి వెళ్ళిపోతారట.

Interesting news on Charan-Shankar movie:

Interesting info on Charan-Shankar film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ