Advertisementt

వరస అప్ డేట్స్ తో RRR టీం

Tue 30th Mar 2021 01:18 PM
rrr,ajay devgn,first look,rrr motion poster,rajamouli,ntr,ram charan,rrr movie  వరస అప్ డేట్స్ తో RRR టీం
RRR Movie Crazy Update వరస అప్ డేట్స్ తో RRR టీం
Advertisement
Ads by CJ

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ డేట్ అనౌన్స్ చేసింది మొదలు ఆర్.ఆర్.ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ బయటికి వస్తున్నాయి. అక్టోబర్ లో రిలీజ్ డేట్ ఇచ్చినప్పటినుండి సినిమాపై విపరీతమైం అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీలో బాలీవుడ్ నటులు చాలామంది నటిస్తున్నారు. అందులో ఆర్.ఆర్.ఆర్ హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ పుట్టిన రోజున సీత లుక్ ని రివీల్ చేసింది. సీత గా అలియా భట్ లుక్ అదిరింది. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజునాడు అల్లూరి గ రామ్ చరణ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసింది.

ఇక మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన రోజు అంటే మే నెలాఖరు వరకు ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ ఉండదేమో అనుకుంటే.. మళ్ళీ ఏప్రిల్ 2 న అజయ్ దేవగన్ లుక్, మోషన్ పోస్టర్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా క్రేజీ అప్ డేట్ ఇచ్చింది ఆర్.ఆర్.ఆర్ టీం. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కొమరం భీం లుక్ కానీ, రామ్ చరణ్ అల్లూరి లుక్ కానీ, అలియా సీత లుక్ కానీ ఏదైనా ఆర్.ఆర్.ఆర్ నుండి వచ్చిన అప్ డేట్ క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇప్పుడు అజయ్ దేవగణ్ ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ కోసం బాలీవుడ్ సైతం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తుంది.

RRR Movie Crazy Update:

RRR: Ajay Devgn to unveil his first look motion poster on April 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ