జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరేక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ మూవీ తో పాటుగా జెమిని ఛానల్ లో త్వరలోనే మొదలు కాబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు షో అలాగే త్రివిక్రమ్ మూవీ కూడా ఏప్రిల్ లేదా మే నుండి మొదలు పెట్టబోతున్నాడు. సినిమాలతో బిజీగా ఉంటున్న ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా ఆయనపై ఒత్తిడి పెరుగుతుంది. అటు మీడియా ఇటు టిడిపి నాయకులూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు అంటూ డైరెక్ట్ గా ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదు, సమయం వచ్చినప్పుడు పాలిటిక్స్ పై మాట్లాడతాను అంటూ తప్పించుకుంటున్నారు. కానీ టిడిపి నాయకులు ఎన్టీఆర్ టిడిపి పార్టీ పగ్గాలు తన చేతుల్లోకి తీసుకోవాలంటూ అధినేత చంద్రబాబుపై రోజు రోజుకి ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ రోజు టిడిపి ఆవిర్భావ దినోత్సవం రోజున మరోసారి తారక్ రాజకీయ ఎంట్రీ చర్చకు వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సమయం ఆసన్నమైంది అంటూ టీడీపీ ముఖ్య నేత గోరంట్ల బుచ్చయ్య చౌదిరి మట్లాడడం ఇప్పుడు చర్చనీయంశమైంది. ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ కానీ స్వచ్ఛందంగా టీడీపీ కి సేవ చేస్తూ.. పార్టీని బలోపేతం చెయ్యాలి అని, ఎన్టీఆర్ మాత్రమే కాదు.. ఇంకా చాలామంది టిడిపిలోకి రావాలని ఆయన కోరుతున్నారు. 40 వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల తారక్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లోకేష్ - ఎన్టీఆర్ - బాలకృష్ణ కలిసి టిడిపిని నడిపించాలని, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చేసింది, టిడిపిలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఈ టీడీపీ నాయకుల కోరికను ఎన్టీఆర్ తీరుస్తాడా? గోరంట్ల వ్యాఖ్యలకు ఎన్టీఆర్ స్పందన ఏమిటి? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పుడు ముహూర్తం పెట్టాడు? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.