Advertisementt

సర్కారు వారి పాటకు అనుకోని అంతరాయం

Mon 29th Mar 2021 05:18 PM
covid 19,mahesh babu,sarkaru vaari paata movie,director parasuram  సర్కారు వారి పాటకు అనుకోని అంతరాయం
Covid Takes A Toll On Sarkaru Vaari Paata సర్కారు వారి పాటకు అనుకోని అంతరాయం
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాట షూటింగ్ మొదలైనప్పటినుండి దర్శకుడు పరశురామ్ గ్యాప్ లేకుండా చిత్రీకరణ చేపట్టాడు. షెడ్యూల్ కి షెడ్యూల్ కి చిన్నపాటి గ్యాప్ తప్ప పెద్దగా విరామం అన్నది లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా సర్కారు వారి పాట కి అనుకోని అంతరాయం ఏర్పడినట్లుగా ఫిలిం నగర్ టాక్. కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న టైం లో సెకండ్ వేవ్ ఉధృతి రోజు రోజుకి పెరిగిపోవడమే కాదు.. సెకండ్ వెవ్ లోనే బాలీవుడ్ లో లెక్కకు మించి సెలబ్రిటీస్ కరోనా బారిన పడడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. 

కరోనా లాక్ డౌన్ తో ఆగిన షూటింగ్స్ అన్ని ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్రీకరణ జరుగుతున్న టైం లో మరోసారి కరోనా పంజా విసరడం అందరిలో అందోళనలు కలిగిస్తుంది. అయితే రీసెంట్ గా మహేష్ బాబు డ్రైవర్ కి కరోనా పాజిటివ్ రావడంతో మహేష్ ఫ్యామిలీ కూడా గుట్టుచప్పుడు కాకుండా కరోనా టెస్ట్ లు చేయించుకున్నట్టుగా ఓ న్యూస్.. మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ దగ్గరనుండి ఆయన భార్య నమ్రత, కొడుకు గౌతమ్, పాప సితారలు అందరూ కరోనా టెస్ట్ చేయించుకున్నారని.. అయితే వారికి నెగెటివ్ వచ్చి ఊపిరి పీల్చుకున్నప్పటికీ రెండు మూడు రోజుల పాటు ఇంట్లో నుంచి కదలకుండా ఉండాలని మహేష్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ సేఫ్ గా ఉండడంతో ఆయన ఫాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.

Covid Takes A Toll On Sarkaru Vaari Paata:

Covid Takes A Toll On Mahesh Sarkaru Vaari Paata

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ