పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. క్రేజు, ఫామ్ ఉన్న టైం లో సినిమాలు వదిలేసి రాజకీయాలకోసం పరిగెత్తినా.. మూడేళ్ళ తర్వాత ఆయన ఇమేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరక్కపోగా.. అది మరింతగా పెరిగింది. అందుకే పవన్ కం బ్యాక్ మూవీ కోసం దిల్ రాజు ప్రాణం పెట్టాడు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ 'లో' బడ్జెట్ లో పూర్తి కావాల్సింది కాస్తా.. హై బడ్జెట్ మూవీగా మారడం.. అక్కడినుండి పవన్ ఇమేజ్ కి సరిపడా కథ సిద్దం చెయ్యడం అన్ని దిల్ రాజు కనుసన్నల్లోనే జరిగాయి. మరి కం బ్యాక్ మూవీ అంటే ఫాన్స్ లో, ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు
ఆ క్రేజుని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు దిల్ రాజు. సినిమాకి ఎడా పెడా ఖర్చు పెట్టి.. అదే క్రేజ్ తో సినిమాని భారీ రేట్లకి విక్రయించాడు. అంతేకాదు.. తాను ఉంచుకున్న ఏరియాల్లో వకీల్ సాబ్ బెన్ఫిట్ షోస్ ప్లాన్ చేసి.. వకీల్ సాబ్ ఒక్కో టికెట్ రూ1500 కి విక్రయించబోతున్నారు. రెండు మూడు బెన్ఫిట్ షోస్ కి రూ1500 ల టికెట్ పెడితే.. తర్వాత ఎర్లీ మార్నింగ్ షోస్ కి 500, రన్నింగ్ షోస్ కి 200 నుండి 250 కి టికెట్ ధరలను కేటాయించారట.
ఇక వకీల్ సాబ్ ఫస్ట్ డే టికెట్స్ కోసం జనసైనికులు, ఫాన్స్, చాలామంది ఎగబడిపోతున్నారట. అందుకే మొదటి రోజు వకీల్ సాబ్ టికెట్స్ కి ఓ రేటు కేటాయించి అన్ని కలిపి అమ్మేసే ప్లాన్ లో ఉన్నారట. వకీల్ సాబ్ పక్కా హిట్ అని, ఒకవేళ తేడా కొట్టిన మొదటి మూడు రోజు బుకింగ్స్ తోనే వకీల్ సాబ్ కి కలెక్షన్స్ మోత మోగేలా దిల్ రాజు పక్కా ప్లానింగ్ తో వకీల్ సాబ్ ని ఏప్రిల్ 9 న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నాడట.