శర్వానంద్ కి లక్కు కలిసి రావడం లేదా మరేదన్నానో కానీ.. ఆయన నటించిన వరస చిత్రాలకు హిట్ టాక్ అయితే వస్తుంది కానీ.. కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు లాసే మిగులుతుంది. ఎంతో ఇష్టపడి దిల్ రాజు బ్యానర్ లో చేసిన తమిళ 96 రీమేక్ జాను చూసి ఆహా అద్భుతంగా ఉంది అన్నారు. శర్వానంద్ లుక్స్, పెరఫార్మెన్స్, జానుగా సమంత నటన అన్ని అదిరిపోయాయి కానీ టికెట్స్ తెగలేదు. కారణం అప్పటికే అందరూ 96 మూవీని చూసేయడమే. ఇక రీసెంట్ గా వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కించిన శ్రీకారం సినిమా పరిస్థితి అంతే.
శర్వానంద్ శ్రీకారం మహాశివరాత్రి రోజున రెండు సినిమాలతో పోటీపడి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. ఆహా.. ఓహో అన్నారే తప్ప సినిమా చూసిన నాథుడు లేదనిపించింది. ఆఖరుకి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీకారం పై పాజిటివ్ గా ట్వీట్ వేసినా ఫలితం సూన్యం. మరి మంచి కథలతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అనిపించుకున్నా కలెక్షన్స్ పరంగా ఆయన సినిమాలు వరసగా ప్లాప్ అవడం మాత్రం ఆయన ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అటు శర్వానంద్ కూడా ఈ విషయంలో కాస్త డీలాపడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న మహా సముద్రం మల్టీస్టారర్ మీదే ఆయన హోప్స్ ఉన్నాయి. అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రంలో మరో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నాడు.