A1 ఎక్స్‌ప్రెస్‌లో సందీప్ కిషన్ సరసన నటించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఆ సినిమా ఓ అన్నంత హిట్ ఇవ్వలేదు. ఆ సినిమాలో లావణ్య త్రిపాఠి క్యారక్టర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. క్యారక్టర్ ఎలా ఉన్నా.. సినిమా హిట్ అయితే లావణ్య త్రిపాఠికి కలిసొచ్చేది. కానీ సినిమా కొచ్చిన కలెక్షన్స్ చూస్తే అది ప్లాప్ అని తేలిపోయింది. ఇక గత వారం లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన మరో సినిమా చావు కబురు చల్లగా అయినా లావణ్యకి హిట్ ఇస్తుంది అనుకుంటే.. ఆ సినిమా కూడా లావణ్య కి హిట్ ఇవ్వలేదు. కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా వచ్చిన ఆ సినిమా కూడా ప్లాప్ లిస్ట్‌లో చేరిపోయింది.
కనీసం చావు కబురైనా చల్లగా చెబుతుంది అనుకుంటే.. అదీ ఆమెకి ప్లాప్ ఇచ్చింది. నర్స్ పాత్రలో విడో గా లావణ్య డీ గ్లామర్ గా సూపర్బ్ గా నటించినా సినిమా కొచ్చిన టాక్ ఆమె కెరీర్ ని కష్టాల్లో పడేసింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ లావణ్యకి రెండు ప్లాప్ లు తగిలాయి. ఆ సినిమాల తర్వాత లావణ్య త్రిపాఠి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి అవకాశం ఇచ్చే దర్శకులు కనిపించడం లేదు. రెండు సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా.. లావణ్య కెరీర్ కి ఉపయోగపడేది. కానీ వరసగా ప్లాప్స్ పడేసరికి ఇప్పుడు లావణ్య కెరీర్ కష్టాల్లోకి వెళ్ళిపోయింది. చూద్దాం లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది.