Advertisementt

పోస్ట్ పోన్ అయిన గోపీచంద్ మూవీ

Sat 27th Mar 2021 01:44 PM
gopichand,sampath nandi,tamannah,seetimaarr movie,seetimaarr postponed  పోస్ట్ పోన్ అయిన గోపీచంద్ మూవీ
Gopichand Seetimaarr Postponed పోస్ట్ పోన్ అయిన గోపీచంద్ మూవీ
Advertisement
Ads by CJ

గోపీచంద్ - సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న సీటిమార్ మూవీ ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎప్పుడో డేట్ ప్రకటించారు. సీటిమార్ సాంగ్స్ ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది టీం. ఇప్పటికే విడుదలైన జ్వాలారెడ్డి సాంగ్ లో తమన్నా చాలా గ్లామర్ గా అదరగొట్టేయ్యగా.. రీసెంట్ గా విడుదలైన మాస్ ఐటెం సాంగ్ పెప్సీ ఆంటీ కూడా యూత్ కి విపరీతంగా నచ్చేసింది. దానితో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక వచ్చే శుక్రవారం విడుదలకావల్సిన సీటిమార్ ప్రమోషన్స్ ఊపందుకునేలోపే సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. 

కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సీటిమార్ సినిమాకి సంబదించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా టీం ప్రకటించింది. మరొక రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామంటూ చెప్పింది. ఈ సినిమాలో భూమిక ఓ కీలక పాత్ర పోషించింది. మరి ఏప్రిల్ 2 నుండి సీటిమార్ షిఫ్ట్ అవడంతో.. నాగార్జున వైల్డ్ డాగ్ కి లైన్ క్లియర్ అయ్యింది. ఎందుకంటే నాగార్జున వైల్డ్ డాగ్ కూడా భారీ ప్రమోషన్స్ తో ఏప్రిల్ 2 నే రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు గోపీచంద్ సీటిమార్ పోటీ అనుకుంటే.. ఇప్పుడు అది పోస్ట్ పోన్ కావడంతో నాగ్ వైల్డ్ డాగ్ సోలోగా థియేటర్స్ కి రాబోతుంది.

Gopichand Seetimaarr Postponed:

Gopichand-Sampath Nandi Seetimaarr Postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ