Advertisementt

సచిన్ కి కరోనా

Sat 27th Mar 2021 01:22 PM
sachin tendulkar,corona,tests positive,covid-19  సచిన్ కి కరోనా
Sachin tests positive for COVID-19 సచిన్ కి కరోనా
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకో నటుడు కరోనా బారిన పడుతున్నారు. నార్త్ లో సెకండ్ వెవ్ కమ్మేసింది అనే అనుమానంలో అంతా ఉన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోలు వరసగా కరోనా బారిన పడడంతో అభిమానులు అందోళన చెందుతున్నారు. అక్కడ అమీర్ ఖాన్ దగ్గరనుండి కార్తీక్ ఆర్యన్, తాజాగా సీనియర్ నటుడు పరేష్ రవెల్ కి కరోనా సోకింది. అందరూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. చాలామందికి కరోనా పాజిటివ్ రావడంపైన అందరిలో ఆందోళన నెలకొంది. 

ఇక నేడు క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ కూడా కరోనా బారిన పడ్డారు. సచిన్ టెండూల్కర్ కి కరోనా సింటెమ్స్ కనిపించడంతో.. ఆయన వెంటనే టెస్ట్ చేయించుకోగా.. సచిన్ కి పాజిటివ్ గా తేలడంతో.. వెంటనే ఆయన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్లుగా ట్వీట్ చేసారు. అయితే తన కుటుంబ సభ్యులు కూడా టెస్ట్ చేయించుకోగా అందరికి నెగెటివ్ వచ్చింది అని.. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలిపారు. తనకి వైద్యం అందిస్తున్న వైద్యులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

Sachin tests positive for COVID-19:

Sachin Tendulkar tests positive for COVID-19

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ