Advertisementt

విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్?

Sat 27th Mar 2021 12:19 PM
vijay,romance,pooja hegde,rashmika,thalapathy 65  విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్?
Vijay to romance two heroines in Thalapathy 65? విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ పూజ హెగ్డే vs రష్మిక మందన్న అన్నట్టుగా వుంది. టాలీవడ్ లో పోటాపోటీ మూవీస్ తో పోటీ పడుతున్న రష్మిక - పూజ హెగ్డే లు ఒకేసారి పాన్ ఇండియా ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. 

పూజ హెగ్డే ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ చేస్తుంటే.. రష్మిక అల్లు అర్జున్ తో కలిసి పుష్ప పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. మరోపక్క పూజ హెగ్డే బాలీవుడ్ లో బిజీ అయిన తరుణంలోనే రష్మిక కూడా అనూహ్యంగా బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది. ఇక తమిళంలోనూ రష్మిక కార్తీ సినిమాలో నటించింది. పూజ హెగ్డే రీసెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికవడమే కాదు.. తాజాగా గా సెట్స్ లోకి ఎంటర్ అయ్యింది. 

అయితే ఇప్పుడు విజయ్ - నెల్సన్ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది అని.. అది రష్మిక అయితే బావుంటుంది అని విజయ్ - దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ భావిస్తున్నారట. రష్మిక కి ఆల్రెడీ తమిళ్ లో క్రేజ్ ఉంది. ఇప్పుడు కార్తీ తో నటించిన సుల్తాన్ మూవీ విడుదల కాబోతుంది. ఈ టైం లో రశ్మికని మరో హీరోయిన్ గా తీసుకుంటే మూవీ పై మరింత బజ్ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నారట. మరి టాప్ హీరోయిన్ పూజ హెగ్డే - రష్మిక ఒకే సినిమాలో కనిపిస్తే  ఆ సినిమా క్రేజే వేరు. అందులోనూ విజయ్ తో పూజ - రష్మిక అంటే ఆ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.  

Vijay to romance two heroines in Thalapathy 65?:

Vijay to romance Pooja and rashmika in Thalapathy 65?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ