మెగాస్టార్ చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీ పై ఎన్నో అంచనాలున్నాయి. ఎందుకంటే వరస చిత్రాల హిట్ తో ఉన్న డైరెక్టర్, అలాగే మెగాస్టార్ చిరు హీరోగా నటించడం, ఈ ఆచార్యలో రామ్ చరణ్ కూడా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆచార్య గా చిరు, సిద్ద గా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన టాప్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుంది. సిద్ద గా ఆచార్య లో నటించిన రామ్ చరణ్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చింది ఆచార్య టీం. ఆచార్య లో చిరు అండ్ చరణ్ లు నక్సలైట్స్ గా కనిపించనున్నారని టాక్ ఉంది. ఇప్పుడు చరణ్ పుట్టిన రోజు స్పెషల్ గా వదిలిన ఆచార్య పోస్టర్ లో తండ్రి కొడుకులు నక్సలైట్స్ గా కనిపిస్తున్నారనేది రుజువైపోయింది.
ధర్మానికి ధైర్యం తోడైన వేళ అంటూ కొరటాల శివ చరణ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ఆచార్య పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో చిరు అండ్ చరణ్ లు చేతిలో గన్స్ తో కిర్రాక్ లుక్ లో దర్శనమిస్తున్నారు. చిరు ఫేస్ లో కాస్త వయసు కనబడుతున్నా సిద్ద గా రామ్ చరణ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. చరణ్ ముందు చిరు తేలిపోయాడనే చెప్పాలి. చరణ యంగ్ లుక్స్ ముందు చిరు ఏజ్ తెలిసిపోతుంది. రామ్ చరణ్ యంగ్ లుక్ లో అదరగొట్టేస్తున్నాడు. మరి ఈ పోస్టర్ చూస్తుంటే తండ్రి కొడుకులు మే 13 న బాక్సాఫీసు రికార్డుల సునామి సృష్టించడం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ రోజు బర్త్ డే జరువుకుంటున్న రామ్ చరణ్ కి సినీ జోష్ టీం తరుపున బర్త్ డే విషెస్.. ఏ వెరీ హ్యాపీ బర్త్ డే టు యు చరణ్