తెలంగాణాలో కరోనా కేసులు పెరగడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖా మంత్రితో సమావేశమై విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసి వెయ్యడంతో తెలంగాణాలో లాక్ డౌన్ అనివార్యమంటూ వార్తలొస్తున్నాయి. అలాగే సినిమా హాళ్లు, షాప్పింగ్ మాల్స్ మూసి వేస్తేనే కరోనా నియంత్రణ సాథ్యం అంటూ కాంగ్రెస్ నాయకులూ పట్టుబడుతున్నారు. అయితే నేడు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ ఉండదని ప్రకటించారు. కేవలం విద్యాసంస్థల వలన కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాబట్టే తాత్కాలికంగా విద్యా సంస్థల మూసివేశామని, మరోసారి తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టం అంటూ స్పష్టతనిచ్చారు.
తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. గత ఏడాది లాక్ డౌన్ వలన కూలిపనులు చేసుకునేవారు, లో క్లాస్ పీపుల్ అలాగే చాలామంది నష్టపోవడమే కాకుండా ప్రపంచం మొత్తం కరోనా కారణంగా అతలాకుతలం అయ్యింది అని.. అందుకే మరోసారి లాక్ డౌన్ పెట్టె ప్రసక్తే లేదంటున్నారు. పరిశ్రమలు మూతబడవని, ఇక లాక్ డౌన్ లేకపోయినా.. కరోనా ఉధృతి నేపథ్యంలో కొద్దిమంది సమక్షంలోనే శుభకార్యాలు జరుపుకోవాలని, కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసారు.