Advertisementt

స్పెషల్ ఏంటి బాసూ

Thu 25th Mar 2021 10:33 PM
ram charan,birthday celebrations,shilpakala vedika,rrr special,achrya special,charan birthday  స్పెషల్ ఏంటి బాసూ
Ram Charan Birthday Special? స్పెషల్ ఏంటి బాసూ
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ బర్త్ డే దగ్గరకొచ్చేసింది. మార్చ్ 27 శనివారమే రామ్ చరణ్ బర్త్ డే కావడంతో మెగా ఫాన్స్ లో జోష్ మొదలైపోయింది. ఇప్పటికే బ్లడ్ డొనేషన్, వాటర్ సప్లై ఇలా ఫాన్స్ హంగామా ఉంది. ఇక రేపు సాయంత్రం రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రంగం సిద్ధమైంది. చరణ్ భార్య ఉపాసన రామ్ చరణ్ కి స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. మరోపక్క రామ్ చరణ్ కి మెగా ఫాన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ లు అందిస్తున్నారు. అంతా బాగానే ఉంది.. రామ్ చరణ్ నటించిస్తున్న సినిమాల నుండి ఎలాంటి సర్ప్రైజ్ లు రాబోతున్నాయో స్పష్టత ఇవ్వడం లేదు.

పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ నుండి రామ్ చరణ్ కి బర్త్ డే స్పెషల్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. కానీ టీం హడావిడి ఏం కనిపించడం లేదు. మరోపక్క రామ్ చరణ్ ఆచార్య సినిమాలో సిద్ధగా కనిపించబోతున్నాడు. ఆచార్య నుండి సిద్ద లుక్ రావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక కొత్తగా అనౌన్స్ అయిన శంకర్ - రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ నుండి టైటిల్ అనౌన్సమెంట్ అయినా, లేదా చరణ్ లుక్ అయినా ఇవ్వొచ్చని అంటున్నారు. కానీ ఎక్కడా ఈ న్యూస్ లకి సంబందించిన స్పెషల్స్ ఉన్నాయని ఏ మూవీ టీం రివీల్ చెయ్యడం లేదు. మరి రేపు శనివారం చరణ్ బర్త్ డే స్పెషల్ ఏమిటో చెప్పండి బాసూ అంటూ మెగా ఫాన్స్ గోల గోల చేస్తున్నారు.

Ram Charan Birthday Special?:

Ram Charan Birthday Celebrations at ShilpaKala Vedika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ