Advertisementt

హిట్ కు అలా.. ప్లాప్ కు ఇలా

Thu 25th Mar 2021 08:37 PM
hit movies,plap movies,uppena movie,jathi ratnalu movie,chaavu kaburu challagaa movie,song makings,movie making videos  హిట్ కు అలా.. ప్లాప్ కు ఇలా
So to hit Movies, Like to flop Movies హిట్ కు అలా.. ప్లాప్ కు ఇలా
Advertisement
Ads by CJ

ఏదైనా సినిమా కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంటే.. ఆ సినిమాకి ప్రేక్షకులు ఎంతగా బ్రహ్మరథం పడతారో.. క్రాక్, ఉప్పెన, జాతి రత్నాల సినిమాలను చూసాం. అయితే విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల నుండి ఏ సాంగ్ మేకింగ్ వీడియోనో లేదంటే ఏ మూవీ మేకింగ్ వీడియోనో రిలీజ్ చేసారంటే.. ఆ మేకింగ్ వీడియోస్ క్షణాల్లో వైరాలవుతుంటాయి. అలా ఉప్పెన సినిమా రిలీజ్ అయిన నెల రోజులకి ఉప్పెన సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తే.. అది ఎంతగా వైరల్ అయ్యిందో చూసాం. ఇక రీసెంట్ గా జాతి రత్నాల మేకింగ్ వీడియో కూడా అలానే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

అదే ఓ సినిమా ప్లాప్ అయ్యాక ఆ సినిమాల సాంగ్స్ కానివ్వండి, లేదా మేకింగ్ వీడియోస్ గొప్పగా రిలీజ్ చేసినా.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. లేటెస్ట్ గా చావు కబురు చల్లగా మూవీ నుండి ఓ సాంగ్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర బృందం. కానీ ఆ వీడియోని పెద్దగా చూసిన వారే లేరు. అదే సినిమా హిట్ అయ్యుంటే అందులో ఏం స్పెషల్ ఉందో అనే క్యూరియాసిటిలో అది కాస్తా వైరల్ గా మారేది. కానీ సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో అందులో నుండి సాంగ్ వదిలినా, మేకింగ్ వీడియో వదిలినా పెద్దగా ఉపయోగం లేదనిపిస్తుంది. హిట్ సినిమాలకు ఆ రేంజ్ క్రేజ్ ఉంటే.. ప్లాప్ మూవీస్ కి ఇలా అన్నమాట.

So to hit Movies, Like to flop Movies:

Hit Movie making videos goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ