బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలి సినిమాలంటే కాంట్రవర్సీలకి నెలవు. ఆయన తెరకెక్కించిన ఏ సినిమా అయినా వివాదాల్లో చిక్కుకుంటుంది. దీపికా పదుకొనే - రణ్వీర్ సింగ్ - షాహిద్ కపూర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కించిన పద్మావత్ సినిమా అనేక వివాదాల్లో చిక్కుకుని.. ఆ సినిమా విడుదల చాలా లేట్ అయ్యింది. అది సంజయ్ లీలా సినిమాలకు పబ్లిసిటీ అనుకోవాలో.. లేదంటే కాంట్రవర్సీ కథలనే ఆయన కావాలని ఎంచుకుంటారో కానీ.. ఆయన సినిమాలకు వివాదాలు కొత్త కాదు అన్నట్టుగా సంజయ్ రీసెంట్ మూవీ గంగూభాయి కఠియావాడీ కూడా వివాదాలకు నెలవుగా మారింది.
బాలీవుడ్ క్యూటీ అలియా భట్ గంగూభాయి పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. హుస్సేన్ జైద్ అనే రచయిత రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకాన్ని ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించగా ఆ సినిమా కథాంశం మరణించిన తన తల్లిని కించపరిచేలా ఉందని పేర్కొంటూ గంగూభాయ్ దత్తపుత్రుడు బాబూ రావ్జీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్ ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో రావ్జీ కోర్టుకి వివరించగా.. మేజిస్ట్రేట్ కోర్టు అంతా పరిశీలించి సంజయ్ లీలా భన్సాలీ అలాగే హీరోయిన్ అలియా భట్ ఇద్దరిని కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు పంపింది.