Advertisementt

రష్మిక తో డిన్నర్ డేట్ లో దేవరకొండ

Thu 25th Mar 2021 02:37 PM
vijay deverakonda,rashmika mandanna,dinner date,vijay girl friend,co star,rashmika  రష్మిక తో డిన్నర్ డేట్ లో దేవరకొండ
Devarakonda on a dinner date with Rashmika రష్మిక తో డిన్నర్ డేట్ లో దేవరకొండ
Advertisement
Ads by CJ

గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ ఆన్ స్క్రీన్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రష్మిక - విజయ్ దేవరకొండ ల జోడి డియర్ కామ్రేడ్ లో కలిసి నటించడం, తర్వాత తరుచూ ఇద్దరూ పార్టీలంటూ కెమెరాలకు చిక్కడంతో విజయ్ దేవరకొండ -  రష్మిక ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. గత ఏడాది విజయ్ దేవరకొండ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ లోనూ రష్మిక, విజయ్ ఫ్యామిలీతో కలిసి సందడి చేసింది. అక్కడ రష్మిక స్పెషల్ గా కనిపించడం, హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి ఎవరినీ పిలవకపోయినా.. విజయ్ దేవరకొండ రష్మికాని ప్రత్యేకంగా ఆహ్వానించడంతో వీరి మధ్యన సం థింగ్ సం థింగ్ అనడమే కాదు.. వాళ్ళనే డైరెక్ట్ గా అడిగేసారు. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక లు మాత్రం ఇప్పడిప్పడే కెరీర్ లో సెటిల్ అవుతున్నాం.. మా మధ్యన ఫ్రెండ్ షిప్ తప్ప మరేం లేదు అంటూ వారించారు.

అయితే రీసెంట్ గా ముంబై లో విజయ్ దేవరకొండ - రష్మిక డిన్నర్ డేట్ ఫొటోస్ బయటికి వచ్చాయి. విజయ్ దేవరకొండ - రశ్మికలు ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లారు. ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. విజయ్ - రశ్మికలు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ కోసం ముంబై లో ఉండగా.. రష్మిక బాలీవుడ్ మూవీస్ ఒప్పుకుని.. ముంబై లోనే ఉంటుంది. బాలీవుడ్ మూవీ షూటింగ్స్ కోసం ఓ హోటల్ లో స్టే చేసిన రష్మిక ముంబైలో ఇల్లు కూడా కొనబోతుందనే టాక్ ఉంది. మరి అక్కడే  ముంబై లో ఉన్న విజయ్ అండ్ రష్మికాలు డిన్నర్ డేట్ కి క్యాజువల్ గా వెళ్లారో.. స్పెషల్ గా వెళ్లారో కానీ.. ఇప్పుడు వాళ్ళ ప్రేమ, పెళ్లి టాపిక్ మాత్రం మీడియాలో చర్చకు దారితీసింది.

Devarakonda on a dinner date with Rashmika:

Vijay Deverakonda - Rashmika Mandanna Snapped Post Their Dinner Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ