Advertisementt

పవర్ స్టార్ వైఫ్ పాత్రలో నిత్యా మీనన్

Thu 25th Mar 2021 01:30 PM
nithya menen,pawan kalyan,rana,pawan wife,ak remake,ayyappum koshiem,power star  పవర్ స్టార్ వైఫ్ పాత్రలో నిత్యా మీనన్
Nithya Menon to pair up with Pawan Kalyan? పవర్ స్టార్ వైఫ్ పాత్రలో నిత్యా మీనన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో మొదలైన ఏకే రీమేక్ షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతుంది. ఏకే రీమేక్ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో సహజ నటి సాయి పల్లవి ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నారు. ఆ పాత్ర చేసినందుకు సాయి పల్లవి భారీ పారితోషకం అందుకోబోతుంది అన్నారు. ఇక పవన్ భార్య గా సాయి పల్లవి అనగానే ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ లో ఆయన భార్య పాత్రలో సాయి పల్లవి కాదు.. మరో నేచురల్ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతుంది అనే న్యూస్ మొదలయ్యింది.

సాయి పల్లవి పవన్ ఏకే రీమేక్ కి నో చెప్పడంతో.. నిత్యా మీనన్ ని మూవీ టీం సంప్రదించింది అని.. నిత్య కూడా ఆ పాత్ర చేసేందుకు సానుకూలంగా స్పందించింది అని అంటున్నారు. ఇక మరో హీరో రానా పాత్ర కి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ భార్య పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆమె పాత్రకున్న ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందుకే సాయి పల్లవి అయితే బావుంటుంది అనుకుంటే.. ఇప్పుడామె కాదనడంతో ఆ పాత్ర నిత్యా మీనన్ కి దక్కింది అంటున్నారు. ఇక ఈ సినిమాకి బిల్లా రంగా అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది.

Nithya Menon to pair up with Pawan Kalyan?:

Nithya Menen in Pawan Kalyan AK Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ